Begin typing your search above and press return to search.

ఉమా.. ఆ వ్యాధి గురించి మీకెలా తెలుసు?

By:  Tupaki Desk   |   27 Jan 2017 2:10 PM GMT
ఉమా.. ఆ వ్యాధి గురించి మీకెలా తెలుసు?
X
కొంతమంది మాటలు చిత్రంగా ఉంటాయి. విమర్శించే ప్రయత్నంలో ఎదురు విమర్శల్ని ఎదుర్కొంటారు. తాజాగా ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిస్థితి ఇంచుమించు ఇదే తరహాలో ఉంది. ఏపీ విపక్ష నేత జగన్ ను విమర్శించే క్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఆ వ్యాఖ్యలు ఆయన వైపే వేలెత్తి చూపేలా ఉండటం ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.

ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన దేవినేని ఉమా.. ఏపీ విపక్ష నేత జగన్ పారనోయ వ్యాధితో బాధ పడుతున్నట్లుగా వ్యాఖ్యానించారు. ఇంతకీ ఆ వ్యాధి ఏమిటంటూ తెల్లముఖం వేసిన వారికి వివరించే ప్రయత్నం చేస్తూ.. ‘‘ఈ వ్యాధి ఉన్న వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ వ్యాధితో ఉన్న వారు తమను తాము అతిగా ఊహించుకుంటారు. నిన్న జగన్ కానీ ఢిల్లీలో ఉండి ఉంటే తాను ప్రధానిని అనేవారేమో?’’ అంటూ సీరియస్ గా ఎటకారం ఆడేసే ప్రయత్నం చేశారు.

విశాఖలో నిర్వహించాలని భావించిన కొవ్వొత్తుల ర్యాలీ ఎపిసోడ్ లో.. జగన్ ను విశాఖ ఎయిర్ పోర్ట్ లో భద్రతాఅధికారులు అడ్డుకోవటం.. ఈ సందర్భంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రెండేళ్లలో మిమ్మల్ని అందరిని గుర్తు పెట్టుకుంటా’’ అన్న అంశాన్ని.. కొన్ని మీడియా సంస్థలు.. జగన్ తనను తాను ముఖ్యమంత్రిగా చెప్పుకున్నారంటూ ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో దేవినేని జగన్ పై ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. ఏపీ మంత్రిగారి మాటలు బాగానే ఉన్నా.. అందరికి వచ్చిన పెద్ద డౌట్ ఏమిటంటే.. డాక్టర్ కాని దేవినేనికి.. జనాలకు పేరు కూడా తెలియని రోగం గురించి ఎలా తెలిసింది? అన్నది ప్రశ్నగా మారింది. ప్రతిదీ తానే చేశానని.. తానే ఐడియాలు ఇచ్చానని చెప్పుకునే తమ అధినేత తత్త్వం గురించి వైద్యుల్ని సంప్రదించినప్పుడు ఈ వ్యాధి గురించి తెలిసి ఉంటుందేమోనన్న చతురోక్తులు పలువురు నోటి వెంట వినిపించటం గమనార్హం. అందుకే.. ఎటకారం చేసేటప్పుడు కాస్త ఆచితూచి చేయాలే కానీ.. ఇష్టం వచ్చినట్లు చేస్తే.. రివర్స్ లో తగులుతాయన్న విషయాన్ని ఉమ తరహా నేతలు గర్తిస్తే మంచిది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/