Begin typing your search above and press return to search.
శ్రీవారి ప్రసాదానికి అంబులెన్స్ వాడారు
By: Tupaki Desk | 30 Oct 2017 3:57 AM GMTఅంబులెన్స్‌లను ఎందుకు వాడతారో ఎవరిని అడిగినా చెప్పేస్తారు. ఘనత వహించిన అధికారులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. రోగులను.. అత్యవసర వైద్యసాయం అవసరమైన వారి కోసం వినియోగించాల్సిన అంబులెన్స్ ను శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం వినియోగించటం సంచలనంగా మారింది.
గత నెలలో జరిగిన శ్రీవారి వార్షిక బ్రహోత్సవాల్లో పాల్గొన్న సిబ్బందికి బ్రహ్మోత్సవ బహుమతిగా లడ్డూ ప్రసాదాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం శనివారం తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి లడ్డూ ప్రసాదాన్ని పంపారు. టీటీడీ పంపిన లడ్డూ ప్రసాద ఖాళీ ట్రేలను తిరిగి పంపేందుకు స్విమ్ అధికారులు ఒక అంబులెన్స్ ను వినియోగించారు.
కోట్లాదిమంది భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించే స్వామి వారి ప్రసాద ట్రేలను అంబులెన్స్ లో తిప్పి పంపటం ఏమిటని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు. తాము చేసిన పనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తటంతో స్విమ్స్ అధికారులు తమ పనిని సమర్థించుకునే పనిలో పడ్డారు. వాస్తవానికి సదరు అంబులెన్స్ ను వైద్య విద్యార్థుల కోసం వినియోగిస్తామని.. అందుకే.. ప్రసాద ట్రేలను వినియోగించినట్లు వారు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా.. స్విమ్స్ అధికారుల తీరును టీటీడీ సైతం సమర్థిస్తోంది. అంబులెన్స్ ను వినియోగించినంత మాత్రనా శ్రీవారి ప్రసాదానికి ఎలాంటి అపచారం జరగలేదని చెబుతున్నారు. ఏమైనా.. ఏ వాహనాన్ని ఎందుకోసం వినియోగిస్తారో అందుకోసం వాడితే బాగుండేది. అందుకు భిన్నంగా ఉపయోగించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు స్విమ్స్ అధికారులు కానీ.. ఇటు టీటీడీ అధికారులు కానీ అంబులెన్స్ ఎపిసోడ్‌ను సమర్థించుకుంటున్నా సగటు భక్తులు మాత్రం ఈ తీరును తప్పుపడుతుండటం గమనార్హం.