Begin typing your search above and press return to search.
ఎయిర్ ఇండియాకు ఊహించని షాకిచ్చిన డీజీసీఏ..!
By: Tupaki Desk | 21 Jan 2023 5:41 AM GMTఎయిర్ ఇండియా విమానంలో ఓ మహిళపై తోటి ప్రయాణికుడు మద్యం మత్తులో మూత్ర విసర్జన చేసిన ఘటన ఇటీవల సంచలనంగా మారింది. గత ఏడాది నవంబర్లో ఈ ఘటనపై ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఎయిర్ ఇండియా ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించి విఫలమైంది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో నిందితుడిగా ఉన్న శంకర్ మిశ్రాను పోలీసులు అరెస్టు చేసి బెంగళూరు కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో అతడికి కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. కోర్టు అతనికి 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. శంకర్ మిశ్రా మహిళ పట్ల ప్రవర్తించిన తీరు హేయమైనది అంటూ కోర్టు సైతం వ్యాఖ్యానించింది. కాగా ఈ విషయంలో ఎయిర్ ఇండియా సరైన విధంగా స్పందించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలోనే ఎయిర్ ఇండియాకు డీజీసీఏ పెద్ద షాకిచ్చింది. మూత్ర విసర్జన కేసులో ఎయిర్ ఇండియా నిబంధనలను ఉల్లంఘించినందుకు 30 లక్షల భారీ జరిమానా విధించింది. విధులు సక్రమంగా నిర్వహించని విమాన పైలట్ ఇన్ కమాండ్ లైసెన్స్ ను మూడు నెలలపాటు సస్పెండ్ చేసింది. ర
గ్యూలర్ ఎయిర్ ఇండియా డైరెక్టర్ ఇన్ ఫ్లైట్ సర్వీసులపై మూడు లక్షల జరిమానా విధించింది. ఈ ఘటన సమయంలో ఎయిర్ ఇండియా సరిగ్గా స్పందించకపోవడంతో డీజీసీఏ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
మహిళపై మూత్ర విసర్జన చేసిన శంకర్ మిశ్రా మద్యం మత్తులో ఉన్నాడు. ఆ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాక మహిళకు శంకర్ మిశ్రాకు మధ్య రాజీ కుదిరిందని ఎయిర్ ఇండియా గతంలో ప్రకటించింది. అయితే జనవరి 4న ఆ మహిళ ఈ విషయంపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
చివరకు ఈ ఘటన జరిగిన ఆరు వారాలకు శంకర్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేసి బెంగూళూరు కోర్టు ప్రవేశపెట్టారు. అతడిని కోర్టు 14 రోజుల డిమాండ్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ సంఘటన తర్వాత ఎయిర్ ఇండియా శంకర్ మిశ్రాను నాలుగు నెలలపాటు నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా విమాన సర్వీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలోనే ఎయిర్ ఇండియాపై డీజీసీఏ భారీ జరిమానా విధించి ఊహించని షాకిచ్చింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.