Begin typing your search above and press return to search.

మరో వివాదంలో చిక్కుకున్న కంగనా .. ఏమైందంటే ?

By:  Tupaki Desk   |   12 Sep 2020 3:30 PM GMT
మరో వివాదంలో చిక్కుకున్న కంగనా .. ఏమైందంటే ?
X
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్‌ కు చెందిన ముంబైలోని బంగ్లాను అక్రమ కట్టడంగా చెప్తూ సంబంధిత అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. దీనితో ఇండిగో విమానంలో వెంటనే కంగనా చండీగఢ్‌ నుంచి ముంబై కి చేరుకున్నసంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మరో వివాదంలో ఇరుక్కున్నారు. సెప్టెంబర్ 9న కంగనా ప్రయాణించిన విమానంలో కోవిడ్-19 ప్రోటోకాల్స్ నిబంధనల ఉల్లంఘించారనే ఆరోపణలతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రెగ్యులేటరీ ఇండిగో సంస్థకు నోటీసులు జారీ చేసింది. చండీగఢ్-ముంబై విమానంలో చాలామంది మాస్క్‌లు ధరించలేదని, భౌతిక దూరాన్నిపాటించలేదంటూ వచ్చిన ఆరోపణలపై నివేదిక సమర్పించాల్సిందిగా ఇండిగోకి నోటీసులు జారీచేసింది.

తాజాగా, శనివారం ఓ ప్రకటన జారీచేసిన డీజీసీఏ, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా విమానంలో ఫోటోలు తీసినట్టు గుర్తిస్తే.. రెండు వారాలపాటు సర్వీసులను నిలిపివేయాలని విమానయాన సంస్థలను హెచ్చరికలు చేసింది. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలను ఎదుర్కోవాల్సిన ఉంటుందని తెలిపింది. డైరెక్టర్ జనరల్, జాయింట్ డైరెక్టర్ జనరల్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ లేదా సివిల్ ఏవియేషన్ విభాగం రెగ్యులేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ లిఖితపూర్వకంగా మంజూరు చేసిన అనుమతి నిబంధనలు, షరతులకు లోబడి తప్ప ఏ వ్యక్తి ఫోటోలు తీయరాదు అని తెలిపింది. అటువంటి విమానం ల్యాండింగ్, టేకాఫ్ లేదా డిఫెన్స్ ఏరోడ్రోమ్ వద్ద ఉన్నప్పుడు నిబంధన వర్తించదు అని వెల్లడించింది.

ఇప్పటి నుంచి ఏదైనా ఉల్లంఘన జరిగితే ఆ నిర్దిష్ట మార్గంలో విమాన సర్వీసులు కొంతకాలం నిలిపివేయబడతాయని, ఉల్లంఘనకు కారణమైన వారిపై అన్ని చర్యలు వైమానిక సంస్థ తీసుకున్న తర్వాతే రెండు వారాల తర్వాత విమాన సర్వీసులు పునరుద్ధరించాలి కఠిన హెచ్చరికలు చేసింది. ఇటువంటి ఉల్లంఘన అత్యున్నత భద్రతా ప్రమాణాలను నిర్వహించడంలో రాజీకి దారితీస్తుందని చెప్పింది. డీజీసీఏ నోటీసులపై స్పందించిన ఇండిగో తాము నిర్దేశిత నిబంధనలను అన్నీ పాటించామంటూ వివరణ ఇచ్చింది.