Begin typing your search above and press return to search.
అర్జంటుగా విశాఖకు డీజీపీ... మంత్రి ఇష్యూ రాజుకుంటోందా... ?
By: Tupaki Desk | 11 Feb 2022 8:30 AM GMTవిశాఖకు పోలీస్ బాస్ గౌతం సవాంగ్ సడెన్ ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఆయన విశాఖలో రెండు రోజుల పాటు ఉంటారు. అధికార కార్యక్రమాలతో పాటు అనధికార కార్యక్రమాలు డీజీపీ షెడ్యూల్ లో ఉన్నాయి. ఇదిలా ఉండగా డీజీపీ సడెన్ టూర్ వెనక ఆంతర్యం ఏంటి అన్నదే ఇపుడు చర్చగా ఉంది.
రెండు రోజుల క్రితం విశాఖ వచ్చిన ముఖ్యమంత్రి జగన్ శారదాపీఠంలో స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడకు చేరుకున్న మత్స్య శాఖ మంత్రి సీదరి అప్పలరాజు, లోకల్ సీఐ రాజుల నాయుడు మధ్య తీవ్ర స్థాయిలోనే వాగ్వాదం జరిగింది. తనను ఒక్కరిని మాత్రమే శారదాపీఠం లోపలికి పంపిస్తాను అని సీఐ అనడంతో మండిపోయిన సీదరి అప్పలరాజు ఆయన మీద అనుచిత కామెంట్స్ చేశారు.
ఇదిపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విపక్షాలు అన్నీ కూడా మంత్రి మీద యాక్షన్ తీసుకోమని డిమాండ్ చేస్తున్నాయి. ఇంకో వైపు చూస్తే పోలీసు అధికారుల సంఘం కూడా ఈ విషయంలో చాలా గట్టిగానే రియాక్ట్ అయింది. మంత్రి చేసిన కామెంట్స్ ని ఖండించింది. దీంతో ఇపుడు ప్రభుత్వానికి అతి పెద్ద చిక్కు వచ్చి పడింది అంటున్నారు.
బీసీ సామాజికవర్గానికి చెందిన మంత్రి ఒక వైపు ఉన్నారు. మరో వైపు మంత్రి హాట్ కామెంట్స్ తో తాము బాగా హర్ట్ అయ్యామని పోలీసులు అంటున్నారు. ఇలాగైతే తాము డ్యూటీలు ఎలా చేస్తామని వారు ఏకంగా తమ పోలీస్ బాస్ గౌతం సవాంగ్ కే మొరపెట్టుకుంటున్నారు.
ఈ నేపధ్యంలో అర్జంటుగా విశాఖ టూర్ పెట్టుకున్న డీజీపీ వాస్తవాలను పూర్తి స్థాయిలో తెలుసుకోవడానికే వస్తున్నారు అని అంటున్నారు. ఆయన నగరంలో రెండు రోజుల పాటు బస చేయడంతో మంత్రి చేత మాటలు పడిన సీఐ రాజులు నాయుడు కూడా కలసి ఫిర్యాదు చేస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది.
మరో వైపు ప్రభుత్వంలో ఉన్న మంత్రి మీద ఫిర్యాదు అంటే దాని మీద యాక్షన్ ఏ విధంగా తీసుకోవాలి అన్నది కూదా గౌతం సవాంగ్ కి సవాల్ అనే అంటున్నారు. ప్రభుత్వం వైపు చూసుకున్నా పోలీసుల నుంచి వత్తిడి గట్టిగా ఉంది. మంత్రి అనుచితమైన కామెంట్స్ చేశారు అని అంటున్నారు. మరి మంత్రి క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్ కూడా ఉంది.
మరి వాస్తవాలు అన్నీ పరిశీలించిన మీదట డీజీపీ ప్రభుత్వానికి ఏ విధంగా నివేదిక ఇస్తారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా వైసీపీ సర్కార్ కి మంత్రి సీదరి ఇష్యూ ఇపుడు బాగా ఇరాకటంగా మారింది అంటున్నారు. మంత్రి మీద ఏమైనా యాక్షన్ అంటే కనుక బీసీ వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుంది అన్న భయాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో మంచి హీట్ మీద ఉన్న పోలీస్ వర్గాలని శాంతపరచడం అంటే మంత్రి వైపు నుంచి కనీసం సారీ అయినా చెప్పించాల్సి ఉంటుంది.
మరి ఈ ఇష్యూ ఇపుడు వేడిగా ఉంది. డీజీపీ క్షేత్రస్థాయిలో అధ్యయనం తరువాత దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెడతారు అని అంటున్నారు. ఆ విధంగా టెంపరరీగా ఈ మంటను చల్లార్చి ఆ మీదట విస్తరణలో సీదరి మీద వేటు వేయాలన్నది పెద్దల ఉద్దేశ్యం అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. మొత్తానికి చూసుకుంటే డీజీపీ విశాఖ టూర్ మాత్రం ఇంటరెస్టింగ్ గానే ఉంది అని చెప్పాలి.