Begin typing your search above and press return to search.
జగన్ ఫ్యాన్ చంపుతాడా.? డీజీపీ ఏంటిది.?
By: Tupaki Desk | 25 Oct 2018 10:36 AM GMTవైఎస్ జగన్ పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో జరిగిన హత్యాయత్నాన్ని ఏపీ డీజీపీ చాలా లైట్ గా తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరించింది. ప్రధాన ప్రతిపక్ష నేతను పట్టపగలు దాడి చేసి చంపడానికి ప్రయత్నించిన ఘటనకు సంబంధించి విజయవాడలో మీడియా ముందు ఏపీ డీజీపీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. జగన్ పై హత్యాయత్నం చేసిన వ్యక్తి జగన్ అభిమానే అని ఆయన తెలుపడం అందరినీ షాక్ కు గురిచేసింది. పబ్లిసిటీ కోసమే ఇలా చేసి ఉండవచ్చని కేసును అధికార పార్టీపై రాకుండా డీజీపీ మాట్లాడడం నివ్వెరపరిచింది. కేసును టీడీపీకి అంటకుండా ఏపీ డీజీపీ మాట్లాడారని ప్రతిపక్ష వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఏపీ డీజీపీ మాట్లాడుతూ జగన్ కు ప్రాణాపాయం తప్పిందని.. నిందితుడి దగ్గర 10 పేజీల లేఖ ఉందని చెప్పారు. అయితే ఆ లేఖలో ఉన్న అంశాలను మాత్రం డీజీపీ వెల్లడించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కావాలనే ఈ కేసును సైడ్ చేస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎయిర్ పోర్ట్ పరిధిలో దాడి జరిగినందున అక్కడ భద్రత తమ పరిధిలోకి రాదని డీజీపీ వ్యాఖ్యానించడం.. సీఐఎస్ఎఫ్ దే బాధ్యత అని డీజీపీ తప్పించుకోవడం అనుమానాలకు తావిస్తోంది.
పైగా డీజీపీ ఠాకూర్ ప్రెస్ మీట్ లో కొందరు జర్నలిస్టులు పనిగట్టుకొని దీనివెనుక జనసేన హస్తముందా అని ప్రశ్నించారు. దాడిచేసిన వ్యక్తి జనసేన అభిమాని అట కదా అని పదే పదే ప్రశ్నించడంతో డీజీపీ దీన్ని ఖండించారు. జనసేనకు, దాడికి సంబంధం లేదన్నారు. డీజీపీ మాటలను బట్టి జగన్ పై హత్యాయత్నాన్ని వైసీపీ, జనసేనల మధ్య వివాదంగా మార్చి టీడీపీని సైడ్ చేయాలనే ఆలోచనగా కొందరు కుట్ర చేస్తున్నారని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు.