Begin typing your search above and press return to search.

ధర్మాన వైసీపీకి ట్రబుల్స్ ఇస్తున్నారా....?

By:  Tupaki Desk   |   24 Oct 2022 8:06 AM GMT
ధర్మాన వైసీపీకి ట్రబుల్స్ ఇస్తున్నారా....?
X
ఆయన సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు. ఒక సబ్జెక్ట్ ని పట్టుకుని సాదర జనం నుంచి పడింతుల వరకూ అందరికీ అర్ధమయ్యే తీరుల మాట్లాడాలీ అంటే అది ధర్మాన వల్లనే అవుతుంది. అలా ప్రతీ అంశం మీద మంచి అవగాహన ఉన్న ధర్మానది మూడున్నర దశాబ్దాల రాజకీయం. ఆయన ఎన్నో సార్లు మంత్రి పదవులు నిర్వహించారు. నేదురుమల్లి, విజయభాస్కరరెడ్డి, వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల మంత్రివర్గాల్లో పలు శాఖలను సమర్ధంగా నిర్వహించారు.

అలాంటి ధర్మాన జగన్ క్యాబినేట్ లో మంత్రి పదవి కోసం మూడేళ్ల పాటు నిరీక్షాల్సి వచ్చింది. మొత్తానికి ఆయన కోరికను జగన్ తీర్చారు. మంత్రిగా రెవిన్యూ శాఖను దక్కించుకున్నారు. అయితే ఆరు నెలలు కాలేదు, ఆయన తనకీ మంత్రి పదవి వద్దు అనేస్తున్నారు. తాను రాజీనామా చేస్తానని మీడియా ముందు చెప్పడమే కాదు ఏకంగా జగన్ వద్దకే వెళ్లి తన ప్రతిపాదన పెట్టారు. అయితే జగన్ మాత్రం వద్దు అనేశారు.

దాంతో ధర్మాన మంత్రిగా కొనసాగనున్నారు. ఆయన హ్యాపీగా మినిస్టర్ గా ఉంటారు. మరోసారి పోటీ చేసి కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తారు అని అనుచరులు అంతా అనుకుంటున్న వేళ శ్రీకాకుళం వస్తూనే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని బాంబు పేల్చారు. నిజానికి ధర్మాన సీనియర్ నేత. ఆయన వంటి వారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని జగన్ భావిస్తున్నారు. అందుకే వారసులకు టికెట్ ఇవ్వమని కూడా చెప్పుకొచ్చారు.

కానీ ధర్మాన తన కుమారుడు రాం మనోహర్ నాయుడు కోసం అన్నట్లుగా తాను ఇక రాజకీయాల నుంచి విరమించుకుంటాను అని ప్రకటించారు. అంతే కాదు ఉత్తరాంధ్రా కోసం తాను పాటుపడతాను అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఉత్తరాంధ్రాకు రాజధాని వస్తూంటే ఎవరైనా ఈ ప్రాంతీయులు అడ్డుకుంటే వారు కచ్చితంగా ఈ ప్రాంతానికి ద్రోహుఔ అవుతారు అని ధర్మాన గర్జించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు కోసం మాట్లాడుతూ ఉత్తరాంధ్రా అభివృద్ధిని అవకాశాలను పక్కన పెట్టేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు.

తనకు మంత్రి ఎమ్మెల్యే పదవులు కంటే తన ప్రాంతం అభివృద్ధే ముఖ్యమని ఆయన అంటున్నారు. మొత్తానికి ధర్మాన ఇపుడు ఒక ఉప ప్రాంతీయ నాయకుడిగా మారిపోయారా అన్న చర్చ వస్తోంది. మూడు ప్రాంతాల వారికి సమగ్రమైన ప్రగతి కోసం మూడు రాజధానులు అని జగన్ అంటున్నారు.

దాని కోసం పార్టీ నేతలు ఉద్యమాలు చేస్తున్నారు ధర్మాన అయితే మరో అడుగు ముందుకేసి రాజకీయాలనే స్వస్తి అంటున్నారు. ఒక విధంగా అధినాయకత్వం మాటను దాటి ఆయన ముందుకు వెళ్తున్నారా. బిగ్ ట్రబుల్స్ ఇస్తున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. మరి చూడాలి ఫ్యూచర్ లో ధర్మానా స్టెప్స్ ఎలా ఉంటాయో ఏమిటో.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.