Begin typing your search above and press return to search.

ధ‌ర్మాన‌కు జిల్లా ప్ర‌జ‌లు ఇప్ప‌టికి గుర్తొచ్చారే!

By:  Tupaki Desk   |   12 Sep 2022 9:41 AM GMT
ధ‌ర్మాన‌కు జిల్లా ప్ర‌జ‌లు ఇప్ప‌టికి గుర్తొచ్చారే!
X
ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు. ఏపీలోనే కాదు.. ఉమ్మ‌డి ఏపీలోనూ అంద‌రికీ తెలిసిన నాయ‌కుడు. గ‌తంలో వైఎస్ హ‌యాంలోను.. ప్ర‌స్తుతం జ‌గ‌న్ మంత్రివ‌ర్గంలోనూ చ‌క్రం తిప్పుతున్నారు. అయితే.. ఆయ‌న ఇన్నేళ్లు రాజ‌కీయాల్లో ఉన్నా.. ఎప్పుడూ.. ఆయ‌న సొంత జిల్లా శ్రీకాకుళం గురించి కానీ, ఆయ‌న సొంత ప్రాంతం ఉత్త‌రాంధ్ర గురించి కానీ.. గుర్తుకు వ‌చ్చిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. పాపం.. ఇప్పుడే.. క‌న్నీరు కార్చేస్తున్నా రు. "మా ప్ర‌జ‌ల‌ను కూలివాళ్లుగానే ఉండిపోవాల‌ని.. చూస్తున్నారా?" అంటూ ప్ర‌తిప‌క్షంపై విమ‌ర్శ‌లు సంధించారు.

ఎందుకంటే.. ప్ర‌స్తుతం రాజ‌ధాని రైతుల పాద‌యాత్ర మ‌రోసారి ప్రారంభ‌మైంది. ఇది ఉత్త‌రాంధ్ర వ‌ర‌కు సాగ‌నుంది. అయితే.. ఇది ఎక్క‌డ స‌క్సెస్ అవుతుందో.. సీమ‌లో మాదిరిగా(చిత్తూరు) ఇక్క‌డ కూడా ప్ర‌జ‌లు ఎక్క‌డ బ్ర‌హ్మ‌ర‌థం ప‌డ‌తారో.. దీంతో మూడు రాజ‌ధానుల‌కు ఎక్కడ ముసురు వ‌స్తుందో.. అని భ‌యప‌డు తున్నారో..ఏమో తెలియ‌దు కానీ.. తాజాగా ఆయ‌న స‌రికొత్త వాద‌న తెర‌మీద‌కి తెచ్చారు. ప్రతిపక్ష టీడీపీ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోంద‌న్నారు. ఒక్క అమరావతినే రాజధాని చేయాలనడం వెనుక దురుద్దేశం ఉంద‌న్నారు.

65 ఏళ్లలో మనమంతా కలిసి హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామ‌ని, ఆనాడే అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటే ఇలాంటి ప్రమాదం వచ్చేదికాదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుంటే విభజన జరిగేది కాదని సూక్తులు ముక్తాయించారు.

ఒక్క అమరావతినే అభివృద్ధి చేస్తే మళ్లీ అలాంటి పరిస్థితి రాదా?. ఒక్క చోటనే అభివృద్ధి అనేది సరికాదని శివరామకృష్ణన్‌ కమిటీ కూడా చెప్పిందన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధిని ప్రతిపక్షం ఎందుకు అంగీకరించట్లేదని ప్ర‌శ్నించారు.

"ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధి చెందవద్దా?. ఒక్కచోటే అన్నీ పెట్టి మా పీక కోస్తామంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు ఊరుకుంటారా?. మా ప్రజలు ఎప్పటీకీ కూలీలుగానే ఉండాలా?. సంపద కొద్ది మంది చేతుల్లోనే ఉండాలన్నడాన్ని మేము అంగీకరించం.

మీరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకుంటే మేము చప్పట్లు కొట్టాలా" అని ధ‌ర్మాన‌ ప్రశ్నించారు. అయితే.. మ‌రి త‌మ‌రు ఇన్నేళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. గ‌తంలోనూ మంత్రిగా చేశారు. ప్ర‌స్తుతం కూడా మంత్రిగానే ఉన్నారు.. మ‌రి మీరు చేసింది ఏంటో?! అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్ప‌టికి గుర్తొచ్చామ‌ని.. సిక్కోలు వాసులు.. ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు కూడా నిల‌దీస్తున్నారు. మ‌రి వీరికి ధ‌ర్మాన ఎలా స‌మాధానం చెబుతారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.