Begin typing your search above and press return to search.
కొత్త జిల్లాల రగడపై ధర్మాన మార్క్ జవాబు
By: Tupaki Desk | 31 Jan 2022 12:30 AM GMTఏపీలో కొత్త జిల్లాల మీద వాడి వేడిగా చర్చ సాగుతోంది. హద్దులు సరిహద్దులు పూర్తిగా మార్చేశారని, సమతూల్యత లోపించింది అని చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. నోటిఫికేషన్ లో పేర్కొన్న ప్రకారమే కొత్త జిల్లాలు ఏర్పాడితే సామాజిక, ఆర్ధిక, పారిశ్రామిక సమతూల్యత దెబ్బతింటుంది అని కూడా అంటున్నారు. అదే విధంగా ప్రగతి గతుల్లో కూడా అనూహ్యమైన తేడా వస్తుంది అని చెబుతున్నారు.
ఇక కొన్ని జిల్లాలకు ప్రభుత్వం పేర్లు ఖరారు చేసింది. వాటిలో శ్రీ సత్యసాయి, అన్నమయ్య పేర్లు తప్ప మిగిలిన వాటి మీద రగడ మామూలుగా లేదు. విజయవాడ జిల్లాకు ఎన్టీయార్ పేరు పెట్టడం అసంబద్ధం అన్న వాదన మొదటి రోజు నుంచీ ఉంది. ఆయన పుట్టిన నిమ్మకూరు మచిలీపట్నం జిల్లాలో ఉంటే విజయవాడకు ఎలా పెడతారు అన్న ప్రశ్నలు కొన్ని వైపుల వస్తున్నాయి.
అలాగే తిరుపతి జిల్లాకు శ్రీ బాలాజీ అని వాడుకలో లేని పేరుని, ఉత్తరాది పదాన్ని వెతికి మరీ తెచ్చి పెట్టారని అంటున్నారు. విశాఖ ఏజెన్సీలో పాడేరుని జిల్లా చేస్తూ అల్లూరి పేరు పెట్టడం మీద కూడా విమర్శలు ఉన్నాయి. అల్లూరి అనుచరులైన గంటం దొర, మల్లు దొర పేర్లు పెట్టాలని అంటున్నారు. అదే టైమ్ లో అల్లూరి త్యాగాన్ని కూడా వృద్ధా చేయరాదని, ఆయన పేరుని అనకాపల్లి జిల్లాకు పెట్టాలని కూడా కోరుతున్నారు.
ఇక చాలా నియోజకవర్గాలూ అటూ ఇటూ అయ్యాయి. అదే విధంగా అభివృద్ధి అంతా కొన్ని చోట్ల ఒకే మూలకు వెళ్ళిపోతే మరి కొన్ని చోట అసలు ఒక్క పరిశ్రమ కానీ చిన్నపాటి సంస్థ కానీ లేని లోటుంది. మరి కొన్ని జిల్లాలు ఏకంగా కొత్త జిల్లాలకు వందల కిలోమీటర్ల యోజనాల దూరంలో ఉన్నాయి. మరి పాలనా సదుపాయం, ప్రజల మేలు అన్నవి వీటిని చూస్తే ఎక్కడ ఉన్నాయన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
అదే విధంగా ప్రముఖుల పేర్లను పెట్టడంలో ఏ ప్రాతిపదికన నిర్ణయించారు అన్న చర్చ కూడా వస్తోంది. ఒక కార్పోరేషన్ లో ప్రముఖుల విగ్రహాలను ఆ సిటీ పరిధిలో ఏర్పాటు చేయాలంటే ఒక కమిటీ కూర్చుని చర్చిస్తుందని, దాని కోసం కొన్ని ప్రమాణాలను కూడా ఎంచుకుని వాటి మేరకే నిర్ణయాలు తీసుకుంటారని గుర్తు చేస్తున్నారు.
అలాంటిది ఫలానా వారి పేరు పెట్టమని ఎవరైనా కోరితే మీరు వెళ్ళి ఆయా జిల్లాల కలెక్టర్లకు వినతులు ఇవ్వండి అని ఒక మంత్రి గారు అంటున్నారు. మెజారిటీని బట్టి చూస్తామని చెబుతున్నారు. అలాంటపుడు ఉత్సాహవంతులు ఎక్కువగా వినతులు ఇస్తే ఆ పేరు పెట్టేస్తారా. ఇక్కడ నంబరే ముఖ్యమా లేక ఆయా ప్రముఖులు చేసిన సేవలు ముఖ్యమా అన్న దానికి ఒక ప్రమాణం విధానం ఉందా అని చాలా మంది అడుగుతున్నారు.
ఇలా ఎన్నో సందేహాలు గత నాలుగు రోజులుగా ముందుకు వస్తున్న వేళ రెవిన్యూ మంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ స్పందించారు. తాము ఆషామాషీగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయలేదని ఆయన అంటున్నారు. అదే విధంగా కొత్త జిల్లాల మీద తీసుకున్న నిర్ణయం కూడా ఈ రోజుది కాదు, దాని వెనక హడావుడి అంతకంటే లేదు అని అంటున్నారు. చాలా శాస్త్రీయంగా అన్ని అంశాలను అధ్యయనం చేసి మరీ నోటిఫికేషన్ ఇచ్చామని ధర్మాన అంటున్నారు.
ఇక రాష్ట్రానికి విశేషంగా సేవ చేసిన మహనీయులను స్మరించుకుంటూ కొన్ని చోట్ల వారి పేర్లు పెట్టామని చెబుతున్నారు. అలాగే చారిత్రక నేపధ్యాన్ని పరిగణనలోకి తీసుకున్నామని, ప్రజల మనోభావాలను కూడా గౌరవించమని ధర్మాన అంటున్నారు. సరే ప్రభుత్వం లోతైన అధ్యయనం చేసింది అదే సమయంలో చాలా చోట్ల కొత్తగా పేర్లు పుట్టుకువస్తున్నాయి. తమ వారి పేర్లను పెట్టమని కూడా కోరుతున్నారు కదా.
మరి రాష్ట్రానికి విశేషంగా సేవ చేసిన వారి పేర్లనే జిల్లాలకు పెడతామని ఒక విధానాన్ని కనుక పెట్టుకుంటే ఇలాంటి డిమాండ్లు చాలా వరకూ ఆగుతాయి. అంత తప్ప మీరు అర్జీలు ఇవ్వండి ఏ పేరు అయినా పరిశీలిస్తామంటే ఈ లెక్కన 26 జిల్లాలు సరిపోవు. మరో వంద జిల్లాలు ఏర్పాటు చేసినా సరిపోవు అని అంటున్నారు. ఇక పేర్లతో పాటు ఇతర అసమానతల మీద కూడా మరో మారు దృష్టి పెట్టాలని కోరుతున్నారు.