Begin typing your search above and press return to search.
ఆస్తిని రాసిచ్చేస్తా అంటున్న ధర్మాన...?
By: Tupaki Desk | 20 March 2022 3:30 AM GMTరాజకీయం వేడెక్కుతోంది అంటే ఇదేనేమో. సవాళ్ళూ ప్రతి సవాళ్ళూ ఇలా ఏపీలో నేతల మధ్య వాడి వేడిగానే కధ సాగుతోంది. ఇక శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మరాజు లాంటి పెద్ద మనిషి. ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ కూడా ఇపుడు ఆవేశానికి లోను అయ్యారు. అది కూడా మీడియా ముందుకు వచ్చి మరీ విపక్షం మీద ఆవేశ కావేశాలను ప్రదర్శించారు.
మళ్లీ వచ్చేది జగన్ సర్కారే. ఇది ముమ్మాటికీ నిజం. ఇందులో రెండవ మాటకు అసలు తావు లేదు. ఏమైనా డౌట్ ఉందా నా సవాల్ ఇదే అంటున్నారు ధర్మాన. ఇంతకీ ధర్మాన వారి ధర్మాన సవాల్ ఏంటి అంటే తన ఆస్తి మొత్తం ప్రజలకు ఇచ్చేస్తాను అని. ఒకవేళ ఏ కారణం చేతనైనా వైసీపీ ఈసారి పవర్ లోకి రాకుంటే దాసన్న ఆస్తి జనం సొత్తు అవుతుందన్న మాట.
మరి ఈ సవాల్ లో తికమక, మకతిక ఏమైనా ఉందో లేదో ఇపుడు తెలియదు. కానీ ధర్మాన పెద్ద మనిషిగా చాలా పెద్ద మాటలనే చెప్పారు. ఏపీలో జగన్ కి తప్ప అధికారంలోకి వచ్చే సత్తా ఎవరికి ఉందని కూడా అయన ప్రశ్నిస్తున్నారు. ఏపీలో జగన్ చేస్తున్న కార్యక్రమాలు కానీ ఆయన పాలన తీరు కానీ తమకు పెట్టుబడులని చెప్పుకున్నారు. ఏపీ ప్రజల గుండెల్లో జగన్ నవరత్నాల పధకాల ద్వారా నిలిచిపోయారని అంటున్నారు.
అంతే కాదు కేవలం 2024 కాకుండా మరో ముప్పయ్యేళ్ల పాటు జగన్ ముఖ్యమంత్రిగా ఏపీలో ఉంటారని కూడా ధర్మాన జోస్యం చెప్పేశారు. ముక్తసరిగానే ఎపుడూ మాట్లాడే ధర్మాన ఇపుడు ఇలా సవాళ్లకు దిగడం అయితే విపక్షం వింతగానే చూస్తోంది. మరి ధర్మాన వారు చెప్పినట్లుగా జగన్ అధికారంలోకి రాకపోతే ఆస్తిని రాసిచ్చేస్తారా. లేక ఎవరూ తన సవాల్ ని స్వీకరించలేదు కాబట్టి అని అపుడు చెప్పి అలా తప్పుకుంటారా. ఏమో. ధర్మాన వారి నమ్మకం వారిది.
జగన్ అధికారంలోకి వస్తారని ఆయన చెప్పకుండా ఎందుకు ఉంటారు. ఆయన అంచనాలు ఆయనకు ఉంటాయి కదా. మొత్తానికి ఈ సిక్కోలు సీనియర్ ఇంత పెద్ద సవాల్ చేయడం వచ్చే ఎన్నికల్లో మళ్లీ మేమే అధికారంలోకి వచ్చేది అని బల్ల గుద్దడం చర్చనీయాంశంగానే ఉంది మరి.