Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌కు డిప్యూటీ సీఎం సైలెంట్ వార్నింగ్‌.. ఏమ‌న్నారంటే!

By:  Tupaki Desk   |   27 Aug 2021 4:30 PM GMT
ప‌వ‌న్‌కు డిప్యూటీ సీఎం సైలెంట్ వార్నింగ్‌.. ఏమ‌న్నారంటే!
X
ఏపీ డిప్యూటీ సీఎం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌.. ఎప్పుడూ సైలెంట్‌గా ఉంటారు. ఆయ‌న వివాదాల‌కు క‌డు దూరంలోనూ ఉంటారు. అయితే.. అప్పుడ‌ప్పుడు మాత్రం ఇంత సైలెంట్‌గా ఉండే ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఆయ‌న ఎప్పుడు ఏం మాట్లాడినా.. రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా ఉంటుంది. తాజాగా కృష్ణ‌దాస్‌.. ఇలాంటి విష‌యాన్నే ఒక‌టి ప్ర‌స్తావించి.. సెంట‌ర్ ఆఫ్ ది లీడ‌ర్‌గా మారారు. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు అంటే.. గ‌త రెండున్న‌రేళ్ల వైసీపీ పాల‌న‌లో జ‌న‌సేన గురించి వైసీపీ నాయ‌కులు పెద్ద‌గా ఎక్క‌డా మాట్లాడింది లేదు. ఎవ‌రూ జ‌న‌సేన గురించి ప‌ట్టించుకోలేదు కూడా. ఎందుకంటే.. గ‌త ఎన్నిక‌ల్లో ఒక్క‌స్థానం మాత్ర‌మే ద‌క్కించుకున్న జ‌న‌సేన‌.. అది కూడా నిలుపుకోలేక‌.. పోయింద‌నే అప‌వాదు ఉంది.

పైగా ఎప్పుడు కూడా జ‌న‌సేన విష‌యంలో వైసీపీ నాయ‌కులు మాట్లాడింది లేదు. తిరుప‌తి ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో ఒక్క‌సారి మాత్రమే.. ప‌వ‌న్ ప్రచారానికి వ‌చ్చిన‌ప్పుడు.. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై ఒక‌రిద్ద‌రు స్పందించారు త‌ప్ప‌.. మిగిలిన వారు అంద‌రూ కూడా సైలెంట్ అయ్యారు. దీనికి కార‌ణం.. జ‌నాల మ‌ద్ద‌తు లేని పార్టీగా వైసీపీ నేత‌లు.. జ‌నసేన‌పై ముద్ర‌వేయ‌డం తోపాటు.. తాము మాట్లాడ‌డం వ‌ల్ల‌.. జ‌న‌సేన ఇమేజ్ పెరుగుతుంద‌నే భావ‌న‌తో ఉండ‌డ‌మే. అందుకే గ‌తంలో జ‌నసేన‌పై విమ‌ర్శ‌లు చేసిన‌.. మంత్రి క‌న్న‌బాబు వంటి కాపు నాయ‌కులు కూడా త‌ర్వాత కాలంలో అధిష్టానం సూచ‌న‌ల మేర‌కు సైలెంట్ అయ్యారు. కానీ, ఇప్పుడు అనూహ్యంగా ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌.. ప‌వ‌న్‌పై విరుచుకుప‌డ్డారు.

శ్రీకాకుళం పట్టణంలో చేనేత బజార్ ప్రారంభ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై డిప్యూటీ సీఎం కృష్ణ దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ''పవన్ కల్యాణ్ గారు పార్టీ పెట్టి రాష్ట్రం అంతా తిరిగి రెండు ప్రాంతాల్లో పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో కంటే సినిమాల్లో మంచి యాక్టర్. రాజకీయాలు గురించి పవన్ కళ్యాణ్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మీరు ఎప్పుడూ సీఎంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తారు. కానీ, త‌మ‌రు జగన్మోహన్ రెడ్డి‌తో మీరు పోల్చుకోకండి. ఆయనకు ఆయనే సాటి. జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం వ‌ల్ల ప్ర‌జ‌ల్లో మీ వాల్యూ మ‌రింత ప‌డిపోతుంది.

ఇక టీడీపీ నేత‌ లోకేష్ వ‌య‌సు త‌గిన విధంగా మాట్లాడ‌డం లేదు. ఆయ‌న కూడా సీఎం పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు .ఇలా విమర్శించడం సబబుగా లేదు. ఆలోచించి మాట్లాడితే మంచిది'' అని కృష్ణదాస్ పేర్కొన్నారు. అయితే.. సైలెంట్‌గానే వ్యాఖ్యానించినా.. దాస్ గారి వ్యాఖ్య‌లు ప‌వ‌న్ వ‌ర్గానికి బాగానే తాకాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి దీనిపై జ‌న‌సేన నేత‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.