Begin typing your search above and press return to search.
అచ్చెన్నాయుడి మీద అవినీతి మరక?
By: Tupaki Desk | 29 July 2015 9:20 AM GMTఏపీ అధికారపక్షంలో మంత్రిగా వ్యవహరిస్తున్న అచ్చెన్నాయుడి మీద అవినీతి మరక పడింది. ఫైర్ బ్రాండ్ మాదిరి విపక్షంపై విరుచుకుపడే ఆయనపై అవినీతి మరకకు దూరంగా ఉన్న ట్రాక్ రికార్డు ఉంది. తాజాగా ఆయనపై అవినీతి ఆరోపణలు సంధించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత.. ఉమ్మడి రాష్ట్రంలో మాజీ మంత్రిగా వ్యవహరించిన ధర్మాన ప్రసాదరావు.
అచ్చెన్నాయుడికి ఇసుక రీచ్ లను నుంచి నెలకు కోటి రూపాయిలు ముడుతుందంటూ తీవ్ర ఆరోపనలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఇసుక మాఫియా ద్వారా అచ్చెన్నాయుడు భారీగా లబ్థి పొందుతున్నట్లుగా ధర్మాన ఆరోపించారు.
నేతల మీద రాజకీయ విమర్శలు మామూలే. కానీ.. ఇప్పటివరకూ అవినీతి మరక అంటకుండా ఉన్న అచ్చెన్నాయుడి మీద.. తాజాగా ఇసుక రీచ్‌ల ద్వారా భారీ ఎత్తున నిధులు ప్రతి నెలా అందుతున్నాయన్న ఆరోపణపై అచ్చెన్నాయుడు ఎలా స్పందిస్తారో చూడాలి. అచ్చెన్నాయుడి మీద అవినీతి మరకేసిన ధర్మాన.. ఏపీలో ఇసుక దందా బాగా పెరిగిపోయిందని.. దీనిపై తాము పోరాటం చేస్తామన్నారు. చూస్తుంటే ఏపీ అధికార.. విపక్షాల మధ్య ఇసుక దుమారం రేగేలా ఉంది.