Begin typing your search above and press return to search.

మ‌హా పాద‌యాత్ర వైసీపీ మంత్రి అనుచిత వ్యాఖ్య‌లు!

By:  Tupaki Desk   |   7 Oct 2022 9:45 AM GMT
మ‌హా పాద‌యాత్ర వైసీపీ మంత్రి అనుచిత వ్యాఖ్య‌లు!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా అమ‌రావ‌తిని మాత్ర‌మే కొన‌సాగించాల‌ని కోరుతూ రైతులు మ‌హా పాద‌యాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అమ‌రావ‌తి నుంచి అర‌స‌వ‌ల్లి వ‌ర‌కు పేరుతో అమ‌రావ‌తి రైతులు ఈ యాత్ర చేస్తున్నారు. ఇప్ప‌టికే ఒక‌సారి రైతులు న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం వ‌ర‌కు పేరుతో ఏపీ హైకోర్టు నుంచి తిరుమ‌ల వ‌ర‌కు పాద‌యాత్ర చేశారు.

మ‌రోమారు అమ‌రావ‌తి ప్రాంతంలోని వెంక‌ట పాలెం వెంక‌టేశ్వ‌ర స్వామి దేవాల‌యం నుంచి అర‌స‌వ‌ల్లిలోని సూర్య దేవాల‌యం వ‌ర‌కు పాద‌యాత్ర‌కు సంక‌ల్పించారు. ఇప్పుడు పాద‌యాత్ర ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో కొన‌సాగుతోంది.

ప్ర‌తిచోటా ఈ పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. మ‌రోవైపు మూడు రాజ‌ధానుల‌కే క‌ట్ట‌బడ్డామ‌ని చెబుతున్న వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేత‌లు రైతుల పాద‌యాత్ర‌పై నిప్పులు చెరుగుతున్నారు. పాద‌యాత్ర చేస్తోంది రైతులు కాద‌ని.. రియ‌ల్ ఎస్టేట్ ఏజెంట్లు అని మండిప‌డుతున్నారు. త‌మ మ‌నోభావాల‌ను రెచ్చ‌గొడితే ఉత్త‌రాంధ్ర‌లో రైతుల‌పై దాడికి కూడా వెనుకాడ‌బోమ‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఉత్త‌రాంధ్ర‌కు చెందిన రెవెన్యూ శాఖ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు కూడా హాట్ కామెంట్స్ చేశారు. రాజ‌ధాని రైతులు చేస్తున్న పాద‌యాత్ర‌పై ఆయ‌న మండిప‌డ్డారు. ''మా పీక కోసేటందుకు అమరావతి నుంచి అరసవెల్లికి పాదయాత్రగా వస్తున్నారా?.. మా ప్రాంతం అభివృద్ధి చెందవద్దా?.. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకోవద్దు.. విశాఖ రాజధానికి అడ్డొస్తే రాజకీయంగా చితక్కొట్టాలి..'' అంటూ మంత్రి ధర్మాన చేసిన అనుచిత వ్యాఖ్య‌లు వైర‌ల్ అయ్యాయి.

విశాఖలో రాజధాని ఏర్పాటైతే మన భవిష్యత్‌ బాగుంటుందని ధర్మాన ప్రసాదరావు అన్నారు. దీనికోసం త్యాగాలు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. విశాఖ రాజధాని అని ఏక కంఠంతో మాట్లాడితే చాలన్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో నిర్వహించిన 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా ధ‌ర్మాన ఈ వ్యాఖ్య‌లు చేశారు.

ఈ సందర్భంగానే అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రపై మంత్రి ఘాటుగా స్పందించారు. ''మా పీక కోసేందుకు అమరావతి నుంచి అరసవల్లికి వస్తారా? మా ప్రాంతాలు అభివృద్ధి చెందనక్కర్లేదా? విశాఖ రాజధానికి అడ్డొస్తే రాజకీయంగా చితక్కొట్టాలి'' అని వ్యాఖ్యానించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.