Begin typing your search above and press return to search.
వచ్చే ఎన్నికల్లో వైసీపీదే అధికారంః ధర్మాన
By: Tupaki Desk | 13 Jun 2017 8:10 AM GMTఆంధ్ర ప్రదేశ్ లో ఏ క్షణంలో ఎన్నికలు జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. జిల్లాలో పార్టీ తరపున జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి, ప్లీనరీ సమావేశాలకు అశేష ప్రజాదరణ లభించడమే ఇందుకు నిదర్శనమన్నారు, ప్రత్యేకించి అధిక శాతం మహిళలు హాజరవుతుండటమే దీనికొక సంకేతమని తెలిపారు
శ్రీకాకుళంలోని 80 అడుగుల రోడ్డులో ఉన్న ఆనందసాయి ఫంక్షన్ హాల్ లో వైసీపీ నియోజకవర్గ ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు ప్రసంగించారు. టీడీపీ ప్రభుత్వ పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికార పక్షం పూర్తిగా విఫలమైందన్నారు.
ముందస్తు ఎన్నికలు జరిగినా టీడీపీని ఓడించేందుకు వైసీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారన్నారు. గ్రామస్థాయి నుంచే కార్యకర్తలందరూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని చెప్పారు. ఈ విషయాలను ప్రజలకు వివరించాలని సూచించారు. మూడేళ్లలో చంద్రబాబు దొంగ వ్యవహారాలు పతాక స్థాయికి చేరాయని విమర్శించారు. అందుకే కేంద్రం, ప్రధానమంత్రి నరేంద్రమోదీ వద్ద ఆయన గౌరవం కోల్పోయారని చెప్పారు. అందువల్లనేమో ఏడాదిగా మోదీ అపాయింట్‌మెంట్ కూడా దొరకడంలేదని ఎద్దేవా చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/