Begin typing your search above and press return to search.
జగన్ శత్రువుపై ధర్మాన దూకుడు
By: Tupaki Desk | 14 Dec 2015 9:50 AM GMTచంద్రబాబు కేబినెట్ లో వైకాపా పేరు చెప్పినా...వైఎస్.జగన్ పేరు చెప్పినా అచ్చెన్నాయుడికి చిర్రెత్తు కొచ్చేస్తుంటుంది. ఆయన ఒంటికాలితో లేచిపోతూ జగన్ తో పాటు వైకాపాపై విమర్శలు చేస్తారు. అసెంబ్లీలోను జిల్లా రాజకీయాల్లోను అచ్చెన్న దూకుడుకు బ్రేకులు వేసేవాళ్లే లేకుండా పోతున్నారు. వైకాపా నాయకులు కూడా అచ్చెన్న విమర్శలు చూసి ఆయనకు చంద్రబాబు జగన్ ను తిట్టే శాఖ ఇచ్చారని విమర్శలు చేస్తున్నారు. జగన్ కూడా పలుసార్లు అసెంబ్లీలో అచ్చెన్నాయుడుకు వేరేం పనేంలేదని తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.
జగన్ ను విమర్శించే గ్యాంగ్ లో ముందుంటున్న అచ్చెన్నాయుడుపై అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి - వైకాపా సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ధర్మాన ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాల్లో అచ్చెన్నాయుడు అవినీతికి అంతే లేకుండా పోతోందన్నారు. అచ్చెన్న జిల్లాలో రెండు దశాబ్దాలుగా మద్యం వ్యాపారాలు నిర్వహిస్తున్నారని.... ఆయన మంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి జిల్లాలో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నాడని ధర్మాన ఆరోపించారు. ఎక్సైజ్ అధికారుల బదిలీలు, ఎమ్మార్పీ ధరలు పెంచుకునేందుకు, బెల్టు షాపులు నిర్వహించుకునేందుకు మంత్రి లక్షల్లో వసూలు చేస్తున్నారని ధర్మాన విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలో 230 మద్యం దుకాణాల ఉండగా ఒక్కొక్క షాపు నుంచి అచ్చెన్నకు నెలకు రూ.లక్షల్లో ముడుపులు ముడుతున్నాయన్నారు.
నిన్నటి వరకు అచ్చెన్నపై అంతగా విమర్శలు చేయని ధర్మాన ఇటీవల తరచూ మీడియా ముందుకు వచ్చి పెదవి విప్పుతున్నారు. జిల్లాలో అధికార పక్షాన్ని ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా విమర్శించేందుకు సాహసించడం లేదు. ఎన్నికలకు ముందు వరకు వైకాపాలో ఎంతో దూకుడుగా ఉన్న ధర్మాన సోదరుడు ఎన్నికల తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ధర్మాన తన దూకుడు పెంచి జగన్ పై ఘాటుగా విమర్శలు చేస్తున్న అచ్చెన్నను టార్గెట్ గా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారు.