Begin typing your search above and press return to search.
అచ్చెన్నాయుడిపై ధర్మాన ఫైర్
By: Tupaki Desk | 10 April 2016 7:24 AM GMTఇద్దరూ ఒకే జిల్లాకు చెందిన నేతలు... ఇద్దరిదీ ఒకటే సామాజికవర్గం. ఒకరు గత ప్రభుత్వంలో చక్రం తిప్పితే ఇంకొకరు ప్రస్తుత ప్రఁభుత్వంలో చక్రం తిప్పుతున్నారు. పదేళ్ల పాటు చక్రం తిప్పి ఇప్పుడు చేతులు ముడుచుకు కూర్చోవాల్సి వచ్చిన మాజీ మంత్రి - వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు - ప్రస్తుతం ఏపీ కేబినెట్ లో చంద్రబాబుకు అత్యంత ప్రీతిపాత్రుడిగా మారిన అచ్చెన్నాయుడల మధ్య తరచూ మాటల యుద్ధం చోటుచేసుకుంటోంది. తాజాగా ధర్మాన తన నోటికి పనిచెప్పారు. టీడీపీ ప్రఁభుత్వాన్ని అచ్చెన్నాయుడిని ఏకకాలంలో వాయించేశారు.
చంద్రబాబు మంత్రివర్గంలో నంబర్ వన్ దగాకోరుగా ఉన్న అచ్చెన్నాయుడికి అత్యుత్తమ మంత్రిగా ఎలా మార్కులు ఇచ్చారో ప్రజలకు తెలియజేయాలని ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన, టీడీపీది దొంగల పాలనని, ఉపాధి హామీ నిధుల్లో 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని ఆయన నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో జగన్ మాట్లాడేటప్పుడు ఆయన మైక్ కట్ చేసి అచ్చెన్నాయుడిని ఉసిగొల్పుతున్నారని, అచ్చెన్నాయుడు వ్యక్తిగత విమర్శలతో కూడిన పిచ్చి వాగుడుతో సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో గెలవబోమన్న భయంతోనే ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని అన్నారు. అమాయకులైన రైతులకు మోసపు మాటలు చెప్పి బాబు అధికారంలోకి వచ్చారని, రైతులు - నిరుద్యోగులు - మహిళలు చంద్రబాబుకు ఓటెందుకు వేశామా అని కుమిలిపోతున్నారని తెలిపారు. వైకాపా నుంచి ఫిరాయించి తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యేలంతా దమ్ము - ధైర్యం ఉంటే తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి తిరిగి గెలిచి రావాలని ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు.
అయితే.. అచ్చెన్నపై విమర్శల మాట ఎలా ఉన్నా ఉపాధి హామీలో అవినీతిపై ధర్మాన మాట్లాడడంపై శ్రీకాకుళం జిల్లా ప్రజలు నవ్వుకుంటున్నారు. ధర్మాన తన ఇంటికి ఏకంగా ఉపాధి నిధులతో తారు రోడ్డు వేయించుకున్న సంగతి ఇంకా తాము మర్చిపోలేదంటున్నారు.