Begin typing your search above and press return to search.
ధర్మాన పాయింటూ నిజమేగా బాబు..?
By: Tupaki Desk | 19 Sep 2016 9:52 AM GMTఏపీకి ఏదో చేస్తున్నట్లుగా తరచూ చెబుతున్నారు బీజేపీ నేతలు. వారి మాటలకు తానా అంటే తందానా అన్నట్లుగా ఏపీ టీడీపీ నేతలు సైతం కేంద్రం చాలానే చేస్తుందని.. అలా చేయించుకోవటంలో తమ డైనమిక్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్ర ఎంతో ఉందంటూ గొప్పలు చెప్పుకోవటం కనిపిస్తుంది. తమ ముఖ్యమంత్రి స్పీడ్ కు ఏపీని ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నట్లుగా తెలుగు తమ్ముళ్లు తరచూ చెప్పటం కనిపిస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ మధ్యనే ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని మోడీ సర్కారు ప్రకటించటం తెలిసిందే.
ఈ ప్యాకేజీ ఎంత గొప్పదో తెలుసా? అంటూ అటు వెంకయ్యనాయుడు మొదలు.. ఇటు సుజనా చౌదరిల వరకూ డప్పు కొట్టుడు ఎక్కువైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకలా అంటే.. రికార్డు సమయంలో ఏపీకి ఎన్నో విద్యాసంస్థల్ని తీసుకొచ్చినట్లుగా వెంకయ్య చెబుతున్నారు. ఆయన మాటలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన.. ప్రత్యేక హోదా.. ప్రత్యేక ప్యాకేజీపై సుదీర్ఘంగా వివరించారు. హోదా మీద బీజేపీ.. టీడీపీలు కలిసి మోసం చేసినట్లుగా చెప్పారు. ఓట్లకు నోట్ల కేసు నుంచి బయటపడేందుకే చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినట్లుగా ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రిపై విరుచుకుపడిన ధర్మాన.. పనిలో పనిగా కేంద్రమంత్రి వెంకయ్య తరచూ చెప్పే కొన్ని మాటల్ని ప్రస్తావిస్తూ.. అదిరిపోయే లాజిక్కు ఒకటి బయటకు తీశారు. ఏపీకి పెద్ద ఎత్తున విద్యాసంస్థలు.. పరిశోధన సంస్థల్ని తీసుకొచ్చామని.. మరే రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి లేదని చెప్పుకొచ్చిన అంశాన్ని ప్రస్తావించిన ధర్మాన.. సదరు విద్యాసంస్థలన్నీ అన్ని రాష్ట్రాల్లోనే ఉండేవే కదా? అని సూటిగా ప్రశ్నించారు.
ఐఐటీ.. ఐఐఎం.. సెంట్రల్ యూనివర్సిటీలు లాంటివి ఇచ్చామని చెబుతున్న కేంద్రం.. అలాంటివి అన్ని రాష్ట్రాల్లో ఉండేవేనని.. అలాంటప్పుడు ఏపీకి ప్రత్యేకంగా ఇచ్చిందేమిటి? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇలా నాలుగు విద్యాసంస్థల్ని తీసుకురావటం కూడా ఆర్థిక సాయం కింద లెక్క చూపించటంపై ధర్మాన అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజమే.. అన్ని రాష్ట్రాల్లో ఉండే విద్యాసంస్థల్ని ఏపీకి ఏదో మేలు చేస్తున్నట్లుగా కేంద్రం బిల్డప్ ఇవ్వటం ఏమిటి..?