Begin typing your search above and press return to search.
సిక్కోలు సీనియర్ కి ఫోన్...ఫుల్ జోష్...?
By: Tupaki Desk | 9 April 2022 12:30 AM GMTఆయన శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేత. మాజీ మంత్రి. అంతే కాదు, ఏపీలోనే రాజకీయ మేధావిగా పేరు తెచ్చుకున్నారు. ఆయనే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఆయనకు మంత్రి పదవి ఖాయం అయింది. నిజానికి ఈ సంగతి ఆయన అన్నయ్య, నిన్నటి ఉప ముఖ్యమంత్రి క్రిష్ణ దాస్ ఇప్పటికే వెల్లడించారు. ఇపుడు అధినాయకత్వం నుంచి ఆయనకు ఫోన్ వచ్చినట్లుగా చెబుతున్నారు.
ఈ సమాచారంతో ధర్మాన అనుచరులు ఫుల్ జోష్ లో ఉన్నారు. వాస్తవానికి ప్రసాదరావుకు మొదటి విడతలో మంత్రి పదవి వస్తుందని అంతా ఊహించారు. అయితే నాడు చాన్స్ అన్న కొట్టేశారు. ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కనబరచిన విధేయతతో పాటు, పడిన కష్టానికి ప్రతిఫలంగా జగన్ గుర్తించి తొలుత మంత్రిని చేసి తరువాత ఉప ముఖ్యమంత్రిని చేశారు. కీలకమైన రెవిన్యూ శాఖను కట్టబెట్టారు.
ఇపుడు తమ్ముడికి చాన్స్ ఇస్తున్నారు. మొత్తానికి చూస్తే చాలా కాలం తరువాత ప్రసాదరావు మంత్రి అవుతున్నారు ఆయన గతంలో నేదురుమల్లి జనార్ధనరెడ్డి, వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల మంత్రివర్గాల్లో పనిచేశారు. ఈ నెల 10న ఆయన శ్రీకాకుళం నుంచి బయల్దేరి అమరావతి చేరుకుంటారు అని అంటున్నారు. ఈ నెల 11న మంత్రివర్గ విస్తరణ ఉంటుంది.
మరో వైపు చూస్తే శ్రీకాకుళం జిల్లాలో రెండవ మంత్రి పదవిని సీదరి అప్పలరాజుకే ఇవ్వాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ఉత్తరాంధ్రాతో పాటు తీర పాంత జిల్లాలంతటా అతి పెద్ద సామాజికవర్గంగా ఉన్న మత్య్సకారుల కోటాలో సీదరికి మంత్రి పదవి కంటిన్యూ అవుతోంది అంటున్నారు. ఆయన సైతం రెండేళ్ల పదవీకాలంలో రాటుదేలారు అని అంటున్నారు.