Begin typing your search above and press return to search.

మావోల ముప్పు..కోర్టుకు చేరిన వైసీపీ నేత‌

By:  Tupaki Desk   |   2 Oct 2018 3:07 PM GMT
మావోల ముప్పు..కోర్టుకు చేరిన వైసీపీ నేత‌
X
సంచలనం సృష్టించిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు - మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య ఉదంతం అనంత‌రం రాజ‌కీయ నాయ‌కులు త‌గు రీతిలో స్పందిస్తున్నారు. ఉత్త‌రాంధ్ర‌లో - ఏపీలో మావోయిస్టులు పుంజుకోవ‌డం - ఇద్ద‌రు ప్ర‌జాప్రతినిధులను కాల్చిచంప‌డం క‌లక‌లం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ధర్మాన ప్రసాద రావు అప్రమత్తమయ్యారు. త‌న‌కు 2+2 సెక్యూరిటీ భద్రత ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఆదేశించాలని ఆయ‌న న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు. ఈ పిటిష‌న్ బుధ‌వారం విచార‌ణ‌కు రానుంది.

ఉత్తరాంధ్రలో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉన్నాయని - ఇటీవల ఇద్దరిని హత్య చేశారని - తనకు ప్రాణహానీ ఉందని పేర్కొంటూ ధ‌ర్మాన న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు. ఏపీ చీఫ్ సెక్రటరీ - ప్రిన్సిపల్ సెక్రటరీ టు హోమ్ - స్టేట్ సెక్యూరిటీ రీవ్యూ కమిటీ - శ్రీకాకుళం ఎస్పీ - ఇంటెలిజెన్స్ అడిషనల్ డైరెక్టర్ జనరల్‌ ల పేర్లను ప్ర‌తివాదులుగా పేర్కొన్నారు. ఈ పిటిష‌న్‌ ను విచార‌ణకు స్వీక‌రించిన న్యాయ‌స్థానం బుధ‌వారం విచార‌ణ‌కు స్వీక‌రించ‌నుంది.

ఇదిలాఉండ‌గా...ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠా - డీజీపీ ఠాకూర్‌ తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్షించారు. ఇవాళ ఉదయం అమరావతిలో వారితో భేటీ అయ్యారు. ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు - మాజీ ఎమ్మెల్యే సోమ హత్యలకు సంబంధించి తన వద్ద ఉన్న సమాచారాన్ని ముఖ్యమంత్రికి డీజీపీ వివరించారు. ఈ ఉదంతానికి సంబంధించి డీజీపీ ప్రాథమిక నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. ఐఏఎస్ - ఐపీఎస్‌ ల బదిలీలపైనా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

మ‌రోవైపు - పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సోమవారం కట్టుదిట్టమైన భద్రత నడుమ చింతపల్లి మండలంలో పర్యటించారు. అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు - మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు కాల్చి చంపడంతో.... హిట్‌లిస్టులో ఉన్న ఎమ్మెల్యే ఈశ్వరి ప‌ర్య‌టించ‌డం క‌ల‌కంగా మారింది. పోలీసులు ఆమెను వారించిన‌ప్ప‌టికీ పర్య‌టించ‌డం గ‌మ‌నార్హం.