Begin typing your search above and press return to search.
రాజధాని మీద జరుగుతున్న ఆందోళన అంతా బోగస్
By: Tupaki Desk | 24 Dec 2019 12:31 PM GMTఏపీ రాజధానిపై ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన కొందరు రైతుల పేరుతో జరుగుతున్న ఆందోళనల్లో నిజం ఎంతన్న విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని పేరుతో జరుగుతున్న ఆందోళన అంతా బోగస్ అని.. అదంతా నాలుగు ప్రాంతాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు చేస్తున్నవని తేల్చారు.
70 ఏళ్లుగా తాగేందుకు గుక్కెడు నీళ్లు లేని ఉత్తరాంధ్ర వెతల గురించి ప్రస్తావించిన ఆయన.. పద్దెనిమిది ఊళ్లవారు చేస్తున్నట్లుగా చెప్పే ఆందోళనల్ని మీడియాలో పెద్దవిగా చేసి చూపిస్తున్నారని.. పెద్ద బొమ్మలు వేసి తప్పు దారి పట్టిస్తున్నట్లు చెప్పారు.
ధర్మాన వ్యాఖ్యల్ని ఆయన మాటల్లోనే చూస్తే.. ‘‘రాజధాని పేరుతో లింగు లింగుమని ఎనిమిది ఊరోళ్లు ఉన్నారు. వారు గొప్ప పోరాటం చేస్తున్నారంట రోజూ.పత్రికల్లో పెద్ద పెద్ద వార్తలు ఏసేస్తున్నారు. పెద్ద పెద్ద బొమ్మలు కనిపిస్తున్నాయ్. ఎందుకు నాయనా పోరాటం? 70 ఏళ్ల నుంచి దిక్కుమొక్కు లేకుండా బతుకుతున్నమాకు లేని పోరాటం మీకెందుకు పోరాటం? ఎందుకు వచ్చింది పోరాటం? ఏం మీ భూముల్ని బాగు చేస్తామన్నారు కదా? మీ ప్లాట్లు కట్టిస్తామన్నారు కదా? మీకు బాధగా ఉన్నదా?’’ అని ఫైర్ అయ్యారు.
‘‘తాగటానికి గుక్కెడు గుంజె కూడా లేని పరిస్థితుల్లో 70 సంవత్సరాల నుంచి ఉన్నామే.. మాకు లేని బాధ మీకెందుకు? ఇలాంటి పప్పులేమీ ఉడకవు. గొప్పగా ఉద్యమం ఉందంటున్నారు. ఎక్కడుంది ఉద్యమం చెప్పండి? రాష్ట్రంలో ఎక్కడైనా ఉద్యమం ఉందా? ఆ నాలుగు ప్రాంతాల్లో తప్పించి ఇంకెక్కడైనా ఉద్యమం ఉందా? ఉద్యమించేస్తున్నారంటూ వస్తున్న వార్తలన్ని ఉత్త బోగస్’’ అని తేల్చారు.
పద్దెనిమిది ఊళ్లల్లో టీడీపీ కార్యకర్తలు చేస్తున్న ఆందోళన. అంతకు మించి లేదు. అదే పెద్ద బొమ్మల్లో వేసి చూపిస్తున్నారు. మనం ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్రభుత్వానికి అండగా నిలవాలన్నారు. ధర్మాన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.