Begin typing your search above and press return to search.
విశాఖ ప్రత్యేక రాష్ట్రం సాధ్యమేనా.. 'ధర్మా'న ఆగ్రహం వెనుక..!
By: Tupaki Desk | 31 Dec 2022 6:50 AM GMTవైసీపీ కీలకనాయకుడు, మంత్రి ధర్మాన ప్రసాదరావు.. తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయంగా కాక పుట్టిస్తున్నాయి. విశాఖను పాలనా రాజధాని చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే.. ఇది సాధ్యం కాకపోతే.. విశాఖను ప్రత్యేక రాష్ట్రం చేసి తమకు అందించాలని.. తామే పాలించుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు. అయితే.. ఇది ఆవేశంతో అన్నారా? అధిష్టానం చెబితే అన్నారా? అనేది ఇప్పుడు ప్రశ్న.
ఏదేమైనా.. ఇప్పటి వరకు ఉన్న రాజధాని సెంటిమెంటును ఆయన మరింత ఎగదోశారనేదివాస్తవం. వచ్చే ఎన్నికలలోపు విశాఖను పాలనా రాజధాని చేయడం ఖాయమని నిన్న మొన్నటి వరకు చెప్పుకొచ్చిన ధర్మాన.. అనూహ్యంగా ప్రత్యేక రాష్ట్రం అంశాన్ని తెరమీదికి తీసుకువచ్చి.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. మూడు జిల్లాలు ఉన్న ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రం చేయడం సాధ్యమా కాదా.. అనేది పక్కన పెట్టేద్దాం.
కానీ, ధర్మాన మాత్రం తేనెతుట్టెను కదిపేశారని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ఇప్పటి వరకు రాజధానిపై వైసీపీకి ఆశించిన విధంగా అయితే.. ఇక్కడ ప్రజల నుంచి స్పందన లభించలేదు.ఈ క్రమం లో ధర్మాన ఏకంగా ప్రత్యేక రాష్ట్రం కావాలని.. కోరడంతో ప్రజల నుంచి స్పందన ఉంటుందని వైసీపీ భావిస్తోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే.. నిధులు, నీళ్లు.. వంటివి నేరుగా అందుకునే అవకాశం ఉంటుంది.
ఇదే విషయాన్ని వైసీపీ నాయకులుప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఇప్పుడు సాధ్యంకాదని అందరికీ తెలుసు. అయితే.. ముందు ముందుజరగబోయే పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వైసీపీకి ఒక ఛాన్స్ దక్కినట్టు అయింది. ఈ నేపథ్యంలో ధర్మాన చాలా వ్యూహాత్మకంగా ఈ వ్యాఖ్యలు చేశారనేది పరిశీలకుల మాట.ఈ దెబ్బతో .. ప్రతిపక్షాల నోళ్లను కట్టడి చేయడంతోపాటు.. వైసీపీ ఇమేజ్ పెంచాలనేది ఆయన వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.