Begin typing your search above and press return to search.
నంద్యాల బాధ్యుడిగా సీనియర్ ను దింపుతున్న జగన్
By: Tupaki Desk | 18 July 2017 8:27 AM GMTవైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత తన పార్టీ నేతలను క్రియాశీలం చేస్తున్నారు. ఇప్పటికే పలు సమస్యలు, ఆందోళన కార్యక్రమాల్లో సీనియర్లతో చర్చించడం ద్వారా టీం వర్క్ స్పూర్తిని పార్టీలో నింపిన జగన్...ఈ క్రమంలో మరో కీలక అడుగుకు శ్రీకారం చుట్టారు. కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల ఇంచార్జీగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి - మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును వైఎస్ జగన్ నియమించారు. సీనియర్ నేతగా - ప్రముఖ వ్యూహాకర్తగా పేరున్న ధర్మాన ప్రసాదరావుకు పార్టీకి కీలకమైన నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికకు సారధ్యం వహించాలని అధినాయకత్వం సూచించినట్టు తెలిసింది.
మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా నంధ్యాల ఉప ఎన్నిక ప్రధాన పార్టీలకు మరింత ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ స్థానం నుంచి గెలుపొందిన భూమా నాగిరెడ్డి వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నప్పటికీ అనారోగ్యానికి గురై హఠాణ్మరణం చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానాన్ని తిరిగి వైసీపీ దక్కించుకోవాలన్న మరింత పట్టుదలతో ఎన్నికల క్యాంపెయిన్‌ను విజయపథం వైపు నడిపించే సమర్థత ఉన్న నేతగా అధినాయకత్వం భావించి ధర్మానకు అప్పగించింది. గతంలో సదావర్తి భూముల విషయంలో ధర్మాన వ్యవహరించిన తీరుతో అధికార తెలుగుదేశం పార్టీ ఇరకాటంలో పడింది. ఈ నేపథ్యంలో ధర్మాన సమర్థతను గుర్తించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ త్వరలో జరిగే నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక బాధ్యతలను నిర్వర్తించాలని కోరినట్లు తెలిపారు.