Begin typing your search above and press return to search.

కేసీఆర్ పై నోరుపారేసుకున్న బీజేపీ ఎంపీ .. ఏమన్నారంటే ?

By:  Tupaki Desk   |   5 Feb 2020 12:51 PM GMT
కేసీఆర్ పై నోరుపారేసుకున్న బీజేపీ ఎంపీ .. ఏమన్నారంటే ?
X
పార్లమెంట్ వేదికగా బీజేపీ, టిఆర్ ఎస్ నేతల మధ్య మాటల యుద్దం తీవ్రతరం అవుతోంది. మీ వల్లే రాష్ట్రం ఇలా తయారైంది అంటూ ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఢిల్లీ వేదికగా రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. తాజాగా కేంద్రం తెలంగాణ కి పసుపు బోర్డుని మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ పసుపు బోర్డు ఏర్పాటుతోపాటుగా ,రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల విషయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, టీఆర్ ఎస్ రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు, టీఆర్ ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిల మధ్య ఒక పెద్ద యుద్ధం జరుగుతోంది.

ఈ మద్యే తెలంగాణ సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ కేంద్రం నుంచి తెలంగాణకు నిధులేవీ రావడం లేదని, తెలంగాణ పై క్షక సాధింపులు చర్యలు పనికిరావు అని , అన్ని రాష్ట్రాలతో పాటుగా తెలంగాణాకి రావాల్సిన నిధుల్ని కూడా కేంద్రం విడుదల చేయడం లేదు అని తెలిపారు. దీనిపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు.దీనితో కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు బీజేపీ ఎంపీ ఆరవింద్. ఎంపీ అడిగిన ప్రశ్నలకి.. సంబంధిత మంత్రి లోక్‌ సభలో సమాధానమిచ్చారు. దాంతో తెలంగాణ ముఖ్యమంత్రి అసత్య ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ ఎంపీ అరవింద్ సీఎం కేసీఆర్ పై ఆరోపణలు చేసారు. గ్రామీణ పేద మహిళల పాలిట కేసీఆర్ శాపంగా మారాడని అరవింద్ ఆరోపించారు. గృహ నిర్మాణాలకు కేంద్రం నిధులు ఇస్తున్నా… వాటిని ఖర్చుచేయకుండా కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని , 2016-17 సంవత్సరానికి 200 కోట్లు పంపిస్తే ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని, నాలుగేళ్ళుగా అయిన ఖర్చుల లెక్కలు చెప్పడం లేదని అరవింద్ అన్నారు. దీనివల్లే కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సమావేశాలకు కేసీఆర్ హాజరు కావడం లేదని ఆరోపించారు.

బీజేపీ ఎంపీ అరవింద్ , సీఎం పై చేసిన ఆరోపణలపై టిఆర్ ఎస్ రాజ్యసభ సభ్యుడు కేకే స్పందించారు. తెలంగాణలో పేదలకు చెందుతున్న పథకాలను ఆపేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని, షాదీముబారక్, కల్యాణ లక్ష్మి పథకాలను అపేందుకు బీజేపీ ఎంపీలు పని చేస్తున్నారని ఆరోపణలు చేసారు. సీఎం కేసీఆర్ పేదల పై ఉండే ప్రేమతో ఎన్నో పథకాల్ని ప్రవేశపెడుతుంటే .. తెలంగాణ ప్రజల పొట్ట కొట్టే దిశగా బీజేపీ ఎంపీలో పార్లమెంటులో ప్రశ్నలు అడుగుతున్నారని విమర్శించారు.

మరోవైపు ఆర్మూరుకు కేంద్రం తాజాగా ప్రకటించిన స్పైసిస్ రీజినల్ కార్యాలయం అంశం కూడా టీఆర్ ఎస్ , బీజేపీ నేతల మధ్య మాటల రచ్చకి కారణం అవుతుంది. కేంద్రం ఇచ్చింది, పసుపు బోర్డు కాదని, కేవలం రీజినల్ కార్యాలయమేనని టీఆర్ ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చెబుతున్నారు. ఇలాంటి రీజినల్ ఆఫీసులు ఇప్పటికే ఆరు ఉన్నాయి. ఈ ఆఫీసును 2018 లోనే ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది ..దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి కూడా కేటాయించింది.. కేంద్రం తాజాగా ఏర్పాటు చేసింది డివిజనల్ ఆఫీస్ ప్రమోషనల్ ఆఫీస్ మాత్రమే.. కేంద్రం పాచి పోయిన అన్నాన్ని నిజామాబాద్ రైతులకు వడ్డిస్తోంది.. రైతులకు /8వాస్తవాలు త్వరలోనే అర్ధమవుతాయి అంటూ జీవన్ రెడ్డి బీజేపీ ఎంపీ అరవింద్ పై ఫైర్ అయ్యారు.