Begin typing your search above and press return to search.
బ్రేకింగ్ : కరోనాతో ఎమ్మెల్యే గన్ మెన్ మృతి?
By: Tupaki Desk | 14 Jun 2020 10:33 AM GMTకరోనా కల్లోలానికి అందరూ బలి అయిపోతున్నారు. సామాన్యులు, అధికారులు, వైద్యులే కాదు.. ఇప్పుడు ప్రజాప్రతినిధుల వంతు కూడా వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మరణ మృదంగం వాయిస్తున్న మహమ్మారి దేశంలోనూ జడలు విప్పుతోంది.
తాజాగా తెలంగాణలో జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి వైరస్ సోకగా.. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు టీడీపీ అధినేత చంద్రబాబు గన్ మెన్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రజాప్రతినిధుల్లో ఆందోళన రోజురోజుకు పెరిగిపోతోంది.
తాజాగా అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గన్ మెన్ కు కూడా కరోనా వైరస్ సోకినట్టు వార్తలు వస్తున్నాయి. అతడు వైరస్ తో మృతిచెందాడని కూడా అంటున్నారు.
ధర్మవరం ఎమ్మెల్యే కు గన్ మెన్ గా చేస్తున్న సురేష్ కరోనా పరీక్షలు చేయించుకోవడాన్ని అవమానంగా భావించాడట.. వెలివేస్తారనే మొహమాటంతో చేయించుకోలేదని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో మా గన్ మెన్ మృతి చెందాడని ఎమ్మెల్యే కేతిరెడ్డి తెలిపినట్టు సమాచారం. కరోనా వచ్చినా మొహమాటానికి పోయి ప్రాణాలు తీసుకోవద్దని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి అన్నట్టు తెలిసింది. అందరికీ పరీక్షలు చేయించిన కేతిరెడ్డి తన ఎమ్మెల్యే కార్యాలయంలో మొత్తం 8మందికి పాజిటివ్ వచ్చినట్టు తెలిపినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి.