Begin typing your search above and press return to search.

ఆప్ ఎంపీని చూసి నేర్చుకోవాలన్న స్టార్ హీరో!

By:  Tupaki Desk   |   4 July 2019 9:48 AM GMT
ఆప్ ఎంపీని చూసి నేర్చుకోవాలన్న స్టార్ హీరో!
X
బాలీవుడ్ హీరో సన్నీడియోల్ ఇటీవలి ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. పంజాబ్ లోని గురుదాస్ పూర్ నియోజకవర్గం నుంచి ఆయన నెగ్గారు. అయితే వెంటనే ఆయన వివాదాల పాలవుతున్నారు. తన బదులు నియోజకవర్గానికి మరొకరు అందుబాటులో ఉంటారని, ఆయనే ఎంపీ గా వ్యవహరిస్తారు అన్నట్టుగా సన్నీడియోల్ ప్రకటించడం వివాదంగా మారింది.

ఎంపీగా ఎన్నికై రెండు నెలలు అయినా గడవకుముందే అలాంటి ప్రకటన చేయడం పట్ల విమర్శలు వచ్చాయి. ఆ సంగతలా ఉంటే..తాజాగా సన్నీడియోల్ కు హితబోధ చేశాడు ఆయన తండ్రి ధర్మేంద్ర. ఎంపీగా ఎన్నికైన తనయుడికి ధర్మేంద్ర గట్టి క్లాస్ పీకారు. ప్రత్యేకించి వేరొక ఎంపీ ప్రస్తావన తీసుకొచ్చి అతడిని ఆదర్శంగా తీసుకోవాలని సన్నీకి ధర్మేంద్ర ఆదేశించారు.

ఆ ఎంపీ మరెవరో కాదు..ఆప్ తరఫున పంజాబ్ నుంచి నెగ్గిన భగవంత్ సింగ్ మాన్. అతడు తనకు పుత్ర సమానుడు అని ధర్మేంద్ర వ్యాఖ్యానించారు. సినిమారంగంలో కొంత కాలం పని చేసి భగవంత్ సింగ్ ఆ కెరీర్ ను వదులుకుని.. మరీ రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా రాణిస్తున్నారని ధర్మేంద్ర అభిప్రాయపడ్డారు. వరసగా రెండో సారి మాన్ ఎంపీగా నెగ్గారు. ఈ నేపథ్యంలో ఆయన ధర్మేంద్రను మరింతగా ఆకట్టుకున్నాడు. అందుకే అతడిని ఆదర్శంగా తీసుకోవాలని తనయుడికి సూచించారు ధర్మేంద్ర.