Begin typing your search above and press return to search.
నవ్వుల పాలైన నటి ప్రచారం.. హీరోగారి ఎంట్రీ!
By: Tupaki Desk | 14 April 2019 4:24 PM GMTఇదే తను చివరి సారి ఎన్నికల్లో పోటీ చేయడం అంటూ ప్రకటించి.. మరోసారి మధుర నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన నటి హేమమాలిని ఎన్నికల ప్రచారం ఇప్పటికే నవ్వులపాలైంది. ఇన్ని రోజులూ మధురలో జనాల మధ్య కనిపించని హేమమాలిని.. ఎన్నికల వేళ రకరకాల జిమ్మిక్కులు చేసి కామెడీ చేశారు.
ఒక చోట గ్రామీణ మహిళలు పంట కోస్తూ ఉంటే.. అక్కడకు వెళ్లి హేమమాలిని వారితో పాటు పని చేసినట్టుగా కలరింగ్ ఇచ్చింది. అందుకు సంబంధించిన ఫొటోలు షేర్ చేసింది. నెట్ లో అవి తీవ్రంగా ట్రోల్ అయ్యాయి.
ఇక మరో చోట బోరింగ్ కొడుతూ హేమమాలిని ఇచ్చిన పోజుతో నెటిజన్లు ఆట ఆడుకున్నారు. ఆమె కెంట్ ప్యూరిఫయర్ కు బ్రాండ్ అంబాసిడర్ అయిన విషయాన్ని ప్రస్తావిస్తూ వారు దుమ్మెత్తి పోశారు.
ఇలా హేమమాలిని ఈ ఎన్నికల ప్రచారంలో ఏం చేసినా అది నెటిజన్లకు నవ్వుల పంట అయ్యింది. ఇలాంటి నేపథ్యంలో ఆమె ప్రచారానికి ఊపందించేందుకు భర్త ధర్మేంద్ర రంగంలోకి దిగారు. ఈ సూపర్ స్టార్ తన భార్యను గెలిపించాలంటూ ప్రచారం మొదలుపెట్టారు.
ఈ విషయాన్ని హేమమాలిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ధరమ్ జీ తన తరఫున ప్రచారానికి రావడంచ ఆలా ఆనందాన్ని ఇస్తోందని హేమ పేర్కొంది. మరి నటీమణి ప్రచారం నవ్వుపాలైన నేపథ్యంలో.. ఈ హీరోగారి ప్రచారం ఆమెను ఈ ఎన్నికల్లో గెలిపిస్తుందేమో చూడాలి! గత ఎన్నికల్లో అయితే హేమ భారీ మెజారిటీతో నెగ్గారు. ఈ సారి అలాంటి విజయం సాధ్యమేనా? అనేది సందేహమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.