Begin typing your search above and press return to search.
పళని..పన్నీర్ బ్యాచ్ కు దినకరన్ మార్క్ షాక్
By: Tupaki Desk | 5 Sep 2017 11:01 AM GMTతమిళనాడు అధికారపక్షంలో చోటు చేసుకున్న అంతర్గత రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒకరోజు ఒకరి పైచేయిగా కనిపిస్తే.. ఆ వెంటనే వైరి వర్గం తమదైన రీతిలో పావులు కదిపి తమకు తగిలిన షాక్ కు డబుల్ షాక్ ఇచ్చేలా చేస్తున్నారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని రీతిలో అన్నాడీఎంకే రాజకీయం మారింది.
పళని.. పన్నీరులు ఏకమై.. చిన్నమ్మకు షాక్ ఇవ్వటం.. దినకరన్ కు అన్నాడీఎంకే పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చేసిన నేపథ్యంలో.. 20 మంది ఎమ్మెల్యేల్ని తీసుకొని పుదుచ్చేరిలో క్యాంప్ రాజకీయాన్ని నడిపిస్తున్నారు.
మరోవైపు తమిళనాడు ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే కీలక నేత స్టాలిన్ రంగంలోకి దిగి గవర్నర్ చేత పళని సర్కారు బలాన్ని ప్రదర్శించాలని ఆదేశించాలని కోరారు.
ఇందుకు గవర్నర్ సున్నితంగా తిరస్కరించటంతో దినకరన్ క్యాంప్ ఎంత కాలం కొనసాగుతుందో అర్థం కాని పరిస్థితి. ఇలాంటి సమయంలోనే పుదుచ్చేరి క్యాంప్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్ కావటంతో దినకరన్ కు కొత్త కష్టాలు ఎదురైనట్లేనన్న అభిప్రాయం వ్యక్తమైంది.
అయితే.. అందులో నిజం లేదన్న విషయాన్ని తన తాజా ఎత్తుతో తేల్చి చెప్పారు దినకరన్. పళని.. పన్నీరు వర్గానికి చెందిన ఇద్దరు ఎంపీలు.. ఇద్దరు ఎమ్మెల్యేలను తమ వర్గానికి తీసుకెళ్లటం ద్వారా దినకరన్ దిమ్మ తిరిగే షాకిచ్చారని చెప్పాలి. తాజా పరిణామంతో తాను ఎప్పుడేం కావాలో అప్పుడు సీఎం పళని క్యాంపులో అలజడి రేపగలలన్న సంకేతాల్ని ఇచ్చారని చెప్పాలి. అంతేనా.. ఒక్కో ఎంపీ కనీసం ముగ్గురు ఎమ్మెల్యేల్ని తీసుకెళ్లిపోయే ప్రమాదం ఉందంటున్నారు.
బలపరీక్షకు అధికారపక్షానికి చెందిన 10 శాతం మంది ఎమ్మెల్యేలు కానీ గవర్నర్ ను కలిసి బలపరీక్షకు కోరితే పళని సర్కారుకు కొత్త కష్టం ఎదురైనట్లు చెబుతున్నారు. సీఎం పళనిపై విశ్వాసం ఉందని ప్రజాప్రతినిధులంతా తమ అభిప్రాయాన్ని చెప్పే కీలక సమావేశం జరుగుతున్న వేళలో ఇద్దరు ఎంపీలు దినకరన్ వర్గంలోకి వెళ్లటంతో షాకింగ్ గా మారింది.
తాజాగా వెలువడుతున్న అంచనాల ప్రకారం దినకరన్ వర్గంలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 21కు చేరుకుందన్న మాట వినిపిస్తోంది. అసెంబ్లీలో పళని వర్గం బలం 115 కాగా.. తాజా పరిణామాలతో 113కు తగ్గింది. మొత్తం అసెంబ్లీలోని ఎమ్మెల్యేల బలంలో 10 శాతం మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై అవిశ్వాసం వ్యక్తం చేస్తే.. బలం నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించే వీలుంది. తాజా పరిణామాలతో తమ వద్ద ఉన్న ఎమ్మెల్యేలు జారిపోకుండా ఉండేలా చూడటం పళని.. పన్నీర్ లకు కొత్త సవాలుగా మారిందని చెప్పక తప్పదు.