Begin typing your search above and press return to search.
డబ్బుల పంపకంలో దినకరన్ హైటెక్ వ్యూహం
By: Tupaki Desk | 27 Dec 2017 11:07 AM GMTఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో అనూహ్య రీతిలో అసమ్మతివర్గం నేత దినకరన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఆర్కేనగర్ ఉపఎన్నికలో ఏఐఏడీఎంకే అభ్యర్థి మధుసూధనన్‌పై దినకరన్ 40,707 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం అనూహ్యంగా నిలిచింది. అయితే ఈ గెలుపు వెనుక దినకరన్ దిమ్మతిరిగే వ్యూహముందట. కేవలం 20రూపాయల నోటుతో దినకరన్ అండ్ టీమ్ మొత్తం వ్యవహారాన్ని హైటెక్ పద్ధతిలో చక్కబెట్టేసిందని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
20 రూపాయల నోటుపై ఒక్కో నోటుపై ఒక్కో కోడ్‌ను ముద్రించిన దినకరన్ వర్గం దీని ప్రకారం..ఓటుకు ఎంత చెల్లించాలో అంత చెల్లించిందట. అయితే ఇక్కడ ట్యాంపర్ కూడా జరగకుండా..ముందుగానే ఆయా కోడ్‌కు సంబంధించిన డీకోడ్‌ను రాసి పెట్టుకున్నారట. దీంతో ఓటర్లకు ఇచ్చిన నోటు తాలూకు నెంబర్‌ని ముందే ఫీడ్ చేసుకుని, చెల్లింపుల సమయంలో ఆ నెంబర్‌నీ - కోడ్‌నీ టాలీ చేసుకుని ఒక్కోనోటుకు 10వేల రూపాయల దాకా సమర్పించుకున్నారట. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బయటపెట్టింది అధికార అన్నాడీఎంకే కావడం గమనార్హం.
ఈ చెల్లింపులకు సంబంధించి వివాదం స్వల్పంగా మొదలై తారాస్థాయికి చేరడంతో వివాదం వెలుగులోకి వచ్చింది. 20రూపాయల నోటుతో ఓటర్లను మభ్యపెడుతున్నారంటూ అధికార అన్నాడీఎంకే పార్టీ గగ్గోలు పెట్టినప్పటికీ..అప్పటికే ఆ పార్టీకి ఓటమి ఖాయమైంది. స్థూలంగా దినకరన్ హైటెక్ వ్యూహాలను అన్నాడీఎంకే పసిగట్టలేకపోయిందని అంటున్నారు. కాగా, ఆర్కేనగర్ ఉపఎన్నికలో ఓటమికి గల కారణాలను అన్వేషించేందుకు డీఎంకే పార్టీ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.