Begin typing your search above and press return to search.

కేఈ ఫ్యామిలీకి కోర్టు డ‌బుల్ షాకిచ్చిందే!

By:  Tupaki Desk   |   28 Dec 2017 9:02 AM GMT
కేఈ ఫ్యామిలీకి కోర్టు డ‌బుల్ షాకిచ్చిందే!
X
టీడీపీ సీనియ‌ర్ నేత‌ - ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ‌మూర్తికి ఇప్పుడు నిజంగానే షాక్ త‌గిలింద‌నే చెప్పాలి. అస‌లిప్పుడు కేఈ ఫ్యామిలీ ఫుల్ జోష్ లో ఉంది. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో కేఈ కృష్ణ‌మూర్తి సోద‌రుడు - మాజీ మంత్రి కేఈ ప్ర‌భాక‌ర్‌ కు టికెట్ ఇచ్చేందుకు స‌సేమిరా అన్న పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు... ఇప్పుడు క‌ర్నూలు స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీ స్థానానికి జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌ల్లో అనూహ్యంగా కేఈ ఫ్యామిలీపై క‌రుణ చూపేసి కేఈ ప్ర‌భాక‌ర్‌ కు టికెట్ కేటాయించారు. ఈ విష‌యంలో చంద్ర‌బాబు అనుస‌రించిన వ్యూహం కార‌ణంగా వైసీపీ బరిలో నుంచి ముందే త‌ప్పుకోగా... ఒక‌రిద్ద‌రు స్వ‌తంత్రులు నిలిచినా... గెలుపు మాత్రం కేఈదేన‌ని ఈ పాటికే తేలిపోయింది. ఈ నేప‌థ్యంలో కేఈ ఫ్యామిలీ సంతోషంగా ఉంది. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో ఆ కుటుంబంలో మ‌రోమారు అల‌జ‌డి రేగింది. కేఈ కృష్ణ‌మూర్తి రాజ‌కీయ వార‌సుడిగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెరంగేట్రం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న ఆయ‌న కుమారుడు - టీడీపీ యువ‌నేత కేఈ శ్యాంబాబుపై కేసు న‌మోదు చేయాల్సిందేన‌ని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

నిన్న‌టి విచార‌ణ సంద‌ర్భంగా కోర్టు జారీ చేసిన ఈ ఆదేశాల‌తో కేఈ ఫ్యామిలీలో నెల‌కొన్న సంతోషక‌ర వాతావ‌ర‌ణం క్ష‌ణాల్లో ఆవిరైపోయింది. అయినా కేఈ శ్యాంబాబు ఏం చేశార‌ని కేసు న‌మోదుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింద‌న్న విష‌యానికి వ‌స్తే.. కేఈ కృష్ణ‌మూర్తి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గానికి వైసీపీ ఇన్‌ చార్జీగా కొన‌సాగుతున్న చెరుకులపాడు నారాయ‌ణ‌రెడ్డి కొంత‌కాలం క్రితం దారుణ హ‌త్య‌కు గురైన విష‌యం తెలిసిందే. ఓ ప‌థ‌కం ప్ర‌కారం ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం ఆయ‌న‌ను అంత‌మొందించింది. దీనిపై విప‌క్ష పార్టీగా వైసీపీ కేఈ ఫ్యామిలీని టార్గెట్ చేసి ఈ హత్య కేఈ శ్యాంబాబు నేతృత్వంలోనే జ‌రిగింద‌ని,, రాజ‌కీయంగా ప్ర‌త్య‌ర్థిని త‌ప్పించుకునేందుకే కేఈ ఫ్యామిలీ ఈ దురాగ‌తానికి పాల్ప‌డింద‌ని ఆరోపించింది. వైసీపీతో పాటు నారాయ‌ణ‌రెడ్డి స‌తీమ‌ణి శ్రీ‌దేవి కూడా ఇదే వాద‌న‌ను వినిపిస్తున్నారు. అయితే ఈ వాద‌న‌కు త‌గ్గ ఆధారాలేమీ లేవని, అయినా కేఈ శ్యాంబాబును అరెస్ట్ చేసి విచార‌ణ చేయాల‌న్నా... ఆయ‌న ప‌రారీలో ఉన్నార‌ని పోలీసులు చెబుతూ వ‌స్తున్నారు.

అందుకు భిన్నంగా కేఈ శ్యాంబాబు మాత్రం ఎక్క‌డికీ పోకుండా... త‌న కుటుంబం నిర్వ‌హించే అన్ని కార్య‌క్ర‌మాల‌తో పాటుగా పార్టీ కార్య‌క్ర‌మాల్లోనూ పాలుపంచుకుంటున్నార‌ట‌. దీనిపై ప‌క్కా ఆధారాలు సేకరించిన శ్రీ‌దేవి... ఇటీవ‌ల శ్యాంబాబు త‌ప్పించుకుని తిర‌గ‌డం లేద‌ని - పోలీసుల క‌ళ్లెదుటే తిరుగుతున్నార‌ని - కేఈ ఫ్యామిలీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న పోలీసులు దీనిని చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన కోర్టు... త‌క్ష‌ణ‌మే శ్యాంబాబుపై కేసు న‌మోదు చేయాల‌ని - చెరుకులపాడు నారాయ‌ణ‌రెడ్డి హ‌త్య కేసు ద‌ర్యాప్తును త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది. అంత‌టితో ఆగ‌ని కోర్టు... కేఈ ఫ్యామిలీకి స‌హ‌క‌రించేందుకు అక్ర‌మ మార్గాలు తొక్కిన వెల్దుర్తి ఎస్సై తుల‌సీ నాగ‌ప్ర‌సాద్‌ పైనా కేసు న‌మోదు చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది. తద్వారా ఈ కేసులో కేఈ ఫ్యామిలీని ర‌క్షించేందుకు య‌త్నించే వారికి కోర్టు ఓ వార్నింగ్ ఇచ్చిన‌ట్లుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.