Begin typing your search above and press return to search.
24 అయితే ఏంటీ.. 40 అయితే ఏంటీ.. ఫిట్నెస్ పై ధోనీ కామెంట్స్..!
By: Tupaki Desk | 20 April 2021 11:30 AM GMTఅంతర్జాతీయ క్రికెట్ కు గుడ్‌బై చెప్పిన మహేంద్రసింగ్ ధోని.. ఐపీఎల్ లో మాత్రం కొనసాగుతున్నాడు. సీఎస్కే (చెన్నై సూపర్‌కింగ్స్ )కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే గత ఐపీఎల్ లో ధోనీ సేన పెద్దగా రాణించలేదు. దీంతో ఈ జట్టుపై ముఖ్యంగా ధోనీపై విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం ధోనీ ఫిట్నెస్ తో లేడని అతడు ఐపీఎల్ నుంచి తప్పుకుంటే మేలని కొందరు వ్యాఖ్యానించారు.
ఈ ఏడాది ఐపీఎల్ లో ధోనీ సేన వరస విజయాలు నమోదుచేస్తున్నది. దీంతో ఆ జట్టుపై ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా ఫిట్నెస్ పై ధోనీ మాట్లాడుతూ.. 'నాకు 24 ఏళ్లు ఉన్నా 49 ఏళ్లు ఉన్నా జట్టు విజయంపై భరోసా ఇవ్వలేను. ఎందుకంటే విజయం అనేది చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఇక ధోనీ అన్ ఫిట్ అన్న మాటలు మాత్రం నన్ను బాధిస్తుంటాయి. ధోనీ ఈ వయసులోనూ ఫిట్నెస్ తోనే ఉన్నాడు.. అని అభిమానులు ప్రేక్షకులు అంటే అదే చాలు నాకు' అంటూ ఇటీవల మహీ వ్యాఖ్యానించాడు.
రాజస్థాన్ రాయల్స్ తో నిన్న జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మొదటి ఇన్సింగ్స్ లో ధోనీ రనౌట్ కాకుండా ఓ అద్భుతమైన డైవ్ చేశాడు. ఈ డైవ్ అందరినీ ఆకట్టుకున్నది. ముఖ్యంగా ధోనీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. 'మహీ ఇంకా ఫామ్ లోనే ఉన్నాడు ఎనీ డౌట్స్' అంటూ కొందరు ధోనీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. ఈ జట్టులో రాజస్థాన్ రాయల్స్ ను ఇరుకున పెట్టేందుకు ధోనీ అద్భుతమైన ఫీల్డింగ్ ను సెట్ చేశాడు.అంతేకాక.. బౌలింగ్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నాడు. దీంతో అతడిపై ప్రశంసలు దక్కుతున్నాయి.