Begin typing your search above and press return to search.
బీసీసీఐ గూబ పగిలేలా బాంబు పేల్చాడుగా?
By: Tupaki Desk | 2 Jun 2017 2:31 PM GMTలోగుట్టు పెరుమాళ్లకే ఎరుక అని చెబుతారు. మరి.. అలాంటి పెరుమాళ్లే బయటకు వచ్చి.. సందేహాల రూపంలో లేఖలు రాస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? సరిగ్గా ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది బీసీసీఐ. భారత క్రికెట్ జట్టుకు సంబంధించిన లోతైన విషయాలతో పాటు.. పలు కాంట్రాక్టులు.. కొన్ని నిర్ణయాలకు సంబంధించిన తెర మీదకు వచ్చిన సందేహాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
బీసీసీఐ పరిపాలన కమిటీ నుంచి తప్పుకున్న ప్రముఖ చరిత్రకారుడు.. రచయిత రామచంద్ర గుహ పేల్చిన లేఖ బాంబు దెబ్బకు బీసీసీఐ గూబ పగిలిపోయేలా ఉందన్న మాట వినిపిస్తోంది. బీసీసీఐ కీలక పదవి నుంచి పక్కకు తప్పుకున్న మరుసటి రోజే.. ఏడు కీలక అంశాలతో ఒక లేఖను సంధించిన వైనం ఇప్పుడు షాకింగ్.
ఈ లేఖలో ఆయన ప్రస్తావించిన అంశాలు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసేలా ఉండటం గమనార్హం. టెస్టుల నుంచి తనకు తానుగా తప్పుకున్న ధోనీకి టాప్ గ్రేడ్ ఎలా కొనసాగిస్తారంటూ.. ఇప్పటివరకూ పెద్దగా బయటకు రాని ప్రశ్నను సంధించి అందరినీ ఉలిక్కిపడేలా చేశారు. భారత క్రికెట్లోనూ.. బీసీసీఐలోనూ కొనసాగుతున్న సూపర్ స్టార్ సంప్రదాయాన్ని ఆయన తీవ్రంగా విమర్శించటమే కాదు.. క్రికెట్ ఏజెన్సీలతో సంబంధం ఉన్న గవాస్కర్ ను వ్యాఖ్యాతగా ఎలా కొనసాగిస్తారంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు.
జాతీయ జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించకుండా.. రెండు నెలల పాటు ఐపీఎల్ మత్తులో మునిగితేలినట్లుగా ఆరోపించిన ఆయన.. టీమిండియాకు ప్రధాన కోచ్ గా వ్యవహరిస్తున్న కుంబ్లేకు బాసటగా నిలిచారు. కుంబ్లే సత్తా ఏమిటన్నది అతడి రికార్డులే చెబుతాయన్న గుహ.. తాజా లేఖాస్త్రం ఇప్పుడు కొత్త కలకలాన్ని రేపుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/