Begin typing your search above and press return to search.
ధోని లక్కీ కెప్టెన్.. అదృష్టవంతుడు
By: Tupaki Desk | 12 July 2020 6:50 AM GMTమాజీ భారత ఓపెనర్ గౌతమ్ గంభీర్ తాజాగా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ప్రశంసల వర్షం కురిపించాడు. లక్కీ కెప్టెన్.. అదృష్టవంతుడు అని తెలిపాడు. తన కెప్టెన్సీలో ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టును కలిగి ఉండడంతో ఎంఎస్ ధోనిని "అదృష్టవంతుడు" అని పిలిచాడు. అయితే టెస్ట్ కెప్టెన్‌గా ఎంఎస్ ధోని సాధించిన ఘనత జహీర్ ఖాన్‌కు మాత్రమే దక్కాలని పేర్కొన్నారు. కపిల్ దేవ్ తర్వాత టెస్ట్ ఫార్మాట్‌లో భారత్‌కు అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడు జహీర్ ఖాన్ మాత్రమే అని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయితే జహీర్ ఖాన్ లాంటి ఆటగాడిని జట్టులోకి తీసుకురావడంతో టెస్ట్ లో ధోని సాధించిన క్రెడిట్ మొత్తం భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి ఇవ్వాలని గంభీర్ తెలిపారు.
అయితే తన ఉద్దేశం ప్రకారం ధోని చాలా అదృష్టవంతుడు అని గంభీర్ చెప్పారు. ఎందుకంటే దాదా కారణంగా అతను ప్రతి ఫార్మాట్‌లో అద్భుతమైన జట్టును పొందాడు అని వివరించారు. జహీర్‌ఖాన్ తన 14 సంవత్సరాల టెస్ట్ కెరీర్‌లో 311 వికెట్లు పడగొట్టాడని.. వాటిలో ధోని కెప్టెన్సీలో 116 వికెట్లు సాధించాడని వెల్లడించారు. అయితే సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో 102 వికెట్లు పడగొట్టాడని తెలిపారు. వీరితో పాటు సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్, మునాఫ్ పటేల్, యువరాజ్ సింగ్, యూసుఫ్ పఠాన్, విరాట్ కోహ్లీ వంటి దాదా ఆటగాళ్లు జట్టులో ఉండడంతోనే ధోని 2011 ప్రపంచ కప్ విజేత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం కష్టమేమీ కాదని పేర్కొన్నారు. అందుకే అతడిని "లక్కీ కెప్టెన్" అని గౌతమ్ గంభీర్ అభివర్ణించారు.