Begin typing your search above and press return to search.

ధోనీ డకౌట్​.. ఐపీఎల్​ లో ఇది ఎన్నోసారంటే..!

By:  Tupaki Desk   |   11 April 2021 3:12 AM GMT
ధోనీ డకౌట్​.. ఐపీఎల్​ లో ఇది ఎన్నోసారంటే..!
X
ఐపీఎల్​ సమరంలో నిన్న ఢిల్లీ క్యాపిటల్స్​.. చెన్నై సూపర్​ కింగ్స్​ తలపడ్డ విషయం తెలిసిందే. ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్​లో ఢిల్లీ సునాయసంగా విజయం సాధించింది. శిఖర్​ ధావన్​, పృథ్వీ షా చెలరేగి ఆడటంతో ఆ జట్టు ఈజీగా విన్​ అయ్యింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్​ లో సీఎస్​కే కెప్టెన్​ మహీ డకౌట్​ కావడంతో ఫ్యాన్స్​ నిరాశకు గురయ్యారు. మ్యాచ్​ ఓడిపోవడం ఓ బాధ అయితే.. మహీ తొలి మ్యాచ్​లోనే పరుగులేమీ సాధించకుండా పెవిలియన్ దారి పట్టడం వారిని ఎక్కువగా బాధించిదట.
మహేంద్రసింగ్​ ధోనీ ఐపీఎల్లో ఇప్పటివరకు మొత్తం నాలుగు సార్లు మాత్రమే డకౌట్ అయ్యాడు. 2010 ఐపీఎల్​ సీజన్​ లో రెండు సార్లు డకౌట్​ అయ్యాడు.

రాజస్థాన్​ రాయల్స్‌ తో చెన్నైలో జరిగిన మ్యాచ్‌ లో ధోనీ డకౌట్‌ గా నిలిచాడు. అదే స్టేడియంలో అదే ఏడాది ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ తో జరిగిన మ్యాచ్‌లో కూడా మహీ మరోసారి పరుగులు ఏమీ చేయకుండానే వెనుదిరిగాడు. ఇందులో రాజస్తాన్‌ రాయల్స్‌ తో గోల్డెన్‌ డక్ గా ఔట్‌ కాగా, డేర్‌డెవిల్స్‌ పై రెండు బంతులు ఆడి డకౌట్‌ అయ్యాడు.

గత సీజన్​ నుంచి సీఎస్​కే జట్టు పెద్దగా రాణించడం లేదు. మెరుగైన బౌలర్లు, బ్యాట్స్​మన్లు ఉన్నప్పటికీ ఆ జట్టు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవడం లేదు. దీంతో మహీ ఫ్యాన్స్​, ఇటు సీఎస్​కే అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఈ సారైనా సీఎస్​కే తన పాత ప్రతాపాన్ని చూపుతుందని భావించినా.. మొదటి మ్యాచ్​ లోనే ఓడిపోవడం ఫ్యాన్స్ కు నిరాశను మిగిల్చింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ తో శనివారం జరిగిన మ్యాచ్‌ లో సీఎస్​కే ముందుగా బ్యాటింగ్‌ కు దిగింది. వాంఖడే స్టేడియం బ్యాటింగ్​ కు అనుకూలంగా ఉంటుంది కాబట్టి పరుగుల వరద తప్పదని అంతా భావించారు.

అయితే ఆరంభంలోనే డుప్లెసిస్‌ డకౌట్‌ అయ్యాడు. దీంతో 7 పరుగుల వద్ద సీఎస్‌కే తొలి వికెట్‌ ను నష్టపోయింది. ఆపై రుతురాజ్‌ గైక్వాడ్‌(5) పరుగులు చేసి పెవిలియన్‌ దారిపట్టాడు. ఇక మొయిన్‌ అలీ (36; 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కొన్ని మెరుపులు మెరిపించాడు. ఆ తర్వాత వచ్చిన సురేశ్​ రైనా (54; 36 బంతుల్లో 3 ఫోర్లు ,4సిక్స్‌లు), అంబటి రాయుడు(23; 16 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) జట్టు పరువును కాపాడారు.

జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు రంగంలోకి దిగిన మహీ.. డకౌట్ అయ్యాడు. పేసర్ అవేశ్ ఖాన్ వేసిన 16వ ఓవర్ మూడో బంతికి ధోనీ ఔట్ అయ్యాడు. బంతిని వికెట్ల మీదకు ఆడుకుని మహీ బోల్డ్ అయ్యాడు. రెండు బంతులు ఎదుర్కొన్న మహీ.. డకౌట్‌ గా వెనుదిరగడంతో అభిమానులు నిరాశకు లోనయ్యారు.
మొత్తానికి సీఎస్​కే 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 188 పరుగులు సాధించింది. కానీ ఈ లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ సునాయసంగా సాధించింది. కేవలం 18.4 ఓవర్లలోనే 190 పరుగులు సాధించి అలవోకగా విజయం సాధించింది.