Begin typing your search above and press return to search.

'ఔను.. ధోనీ బీజేపీలోకి చేరబోతున్నాడు..'

By:  Tupaki Desk   |   13 July 2019 6:10 AM GMT
ఔను.. ధోనీ బీజేపీలోకి చేరబోతున్నాడు..
X
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ గురించి చర్చ జరుగుతూ ఉంది. ప్రపంచకప్ లో ధోనీ ఆటతీరు పలుమార్లు విమర్శలకు దారి తీసింది. సెమిఫైనల్లో కూడా ధోనీ మరి కాస్త ధాటిగా ఆడాల్సిందని, మ్యాచ్ ను అంత వరకూ తీసుకురానీయకుండా.. మధ్యలో బ్యాట్ ను కాస్త ఝలిపించాల్సిందనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఏదేమైనా ధోనీకి చాలా వయసే వచ్చింది.

ధోనీ బ్యాటింగ్ లో నాటి మెరుపులూ లేవు. కీపింగ్ లో కూడా అద్భుతాలు లేవు. ఇంకా ధోనీ జట్టులో కొనసాగి సాధించాల్సిన సమీప లక్ష్యాలూ లేవు. కాబట్టి ఆయన గౌరవంగా రిటైర్మెంట్ అయితే మేలనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో ప్రస్తుతానికి ఫైనల్ చాయిస్ ధోనీదే అవుతుంది.

అదలా ఉంటే.. ధోనీ రిటైర్మెంట్ కావడం ఆలస్యం, ఆయన వెంటనే భారతీయ జనతా పార్టీలోకి చేరతాడనే టాక్ కూడా ఉంది. గత కొన్నాళ్లుగా ఈ మాట వినిపిస్తోంది. తాజాగా బీజేపీ నేత ఒకరు ఆ విషయంలో ప్రకటన కూడా చేశారు. కేంద్ర మాజీ మంత్రి సంజయ్ పాశ్వాన్ ఈ విషయంపై స్పందించాడు.

ధోనీ తనకు మంచి మిత్రుడు అని.. క్రికెట్ నుంచి రిటైర్డ్ కాగానే అతడు రాజకీయాల్లోకి రాబోతున్నాడని సంజయ్ పాశ్వాన్ అన్నాడు. ధోనీ రాజకీయం కోసం బీజేపీలోకే చేరతాడని కూడా ఈయన తేల్చాడు. ధోనీతో సాన్నిహిత్యం మేరకే తను ఈ విషయాన్ని చెబుతున్నట్టుగా ఈ బీజేపీ నేత చెప్పుకొచ్చాడు.