Begin typing your search above and press return to search.
ధోనీ... నిజంగా రియల్ హీరోనే!
By: Tupaki Desk | 22 Feb 2017 10:09 AM GMTనిజమే... టీమిండియాను అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానానికి చేర్చిన కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ.... తన మూలాలు మరిచిపోలేదు. అంతేనా తన కెరీర్ గ్రాఫ్ ను ఆకాశానికెత్తేసిన భారతీయ రైల్వేస్ ను కూడా అతడు మరిచిపోలేదు. అంతేకాదండోయ్... తనకే కాకుండా భారతీయ రవాణా రంగానికే తలమానికంగా నిలిచిన బారతీయ రైల్వేలను కూడా అతడు మరిచిపోలేదు. అయినా అసలు విషయం చెప్పకుండా ఈ సోది అంతా ఎందుకనేగా మీ డౌటు. అక్కడికే వస్తున్నాం.
టీమిండియా కెప్టెన్ గా అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన ధోనీ... ప్రస్తుతం లిమిటెడ్ ఓవర్ల ఫార్మాట్లలోనే జట్టు సభ్యుడిగా కొనసాగుతున్నాడు. అయితే ఈ విషయాన్ని కాస్తంత వెటకారంగా పరిగణించిన ఐపీఎల్ లోని ఓ జట్టు యాజమాన్యం ధోనీ కెప్టెన్సీని ఊడబెరికేసింది. ఈ విషయం సాధారణంగా ఏ క్రికెటర్ ను అయినా కాస్తంత ఇబ్బంది పెట్టేదే. అయితే కెప్టెన్ కూల్ గా ప్రపంచానికి పరిచయమైన ధోనీని మాత్రం ఇబ్బంది పెట్టలేకపోయింది. ఐపీఎల్ కెరీర్ ముగిసిందని భావించిన ధోనీ... తనలోని ఆటకు మాత్రం ఫుల్ స్టాప్ పెట్టేందుకు మాత్రం ఇష్టపడలేదు.
ఇదే విషయాన్ని తెలుసుకున్న అతడి సొంత రాష్ట్రం జార్ఖండ్... అతడిని తన రాష్ట్ర జట్టు కెప్టెన్ గా ప్రకటించింది. ఈ విషయం తెలుసుకున్న ధోనీ... తొలినాళ్లలో తనకు అన్నం పెట్టిన రాష్ట్ర జట్టుతో పాటు తాను క్రికెట్ లో ఎదిగేందుకు ఆసరా ఇచ్చిన రైల్వేస్ ను కూడా అతడు బాగానే గుర్తు పెట్టుకున్నాడు. ఈ రెండు విషయాలు జనానికి బాగానే అర్థమయ్యేలా అతడు ఓ పని చేశాడు. అదే... తన సొంత రాష్ట్రం జార్ఖండ్ లోని హాతియా నుంచి తన జట్టు తొలి మ్యాచ్ ఆడే కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ కు రైలులో ప్రయాణించాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రపంచానికి తెలియపరిచాడు.
అసలు విషయంలోకి వస్తే... విజయ్ హజారే ట్రోఫీ కోసం జరుగుతున్న ఈవెంట్ లో జార్ఖండ్ జట్టుకు ధోనీ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. జట్టు యాజమాన్యం ప్రకటించిన 18 మంది సభ్యులతో కూడిన జట్టుకు అతడే కెప్టెన్. కెప్టెన్ గా తన జట్టు సభ్యులను హాతియాలో రైలెక్కించిన ధోనీ... వారితో సెల్ఫీ తీసుకుని సదరు ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. తన కెరీర్‌కు ఆలంబనగా నిలిచిన రైల్వేస్ లో జట్టు సభ్యులతో కలిసి ప్రయాణం చేయడం తనకు ఎంతగానో సంతోషంగా ఉందని కూడా ధోనీ తన ట్వీట్ లో తెలిపాడు. సో... ధోనీ నిజంగానే... కెప్టెన్ కూలే. అంతేనా... ఆసరా ఇచ్చిన వారిని,. సంస్థలను ఎన్నటికీ మరిచిపోని నిజమైన నాయకుడే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/