Begin typing your search above and press return to search.

చివరిబంతికి ధోని తరహాలో సిక్స్‌ కొట్టి గెలిపించిన షారుక్‌ .. ధోని ఫోటో వైరల్

By:  Tupaki Desk   |   23 Nov 2021 8:30 AM GMT
చివరిబంతికి ధోని తరహాలో సిక్స్‌ కొట్టి గెలిపించిన షారుక్‌ .. ధోని ఫోటో వైరల్
X
క్రికెట్ .. ప్రస్తుతం ప్రపంచంలోనే మోస్ట్ ఫెవరెట్ గేమ్. ప్రతి గల్లీ లో క్రికెట్ ఆడుతుంటారు. ఏ మాత్రం సమయం దొరికినా కూడా బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లో దిగిపోతుంటారు. ఇక క్రికెట్ మ్యాచ్ లో చివరి బంతి కి తమ జట్టుని గెలిపిస్తే వచ్చే ఆ కిక్కే వేరు. అది కూడా ఆ ‘విన్నింగ్‌ షాట్‌’తో టైటిల్‌ సొంతమైతే,ఇక చెప్పేదేముంటుంది. ఇలాంటి మజాను ఎన్నోసార్లు ఆస్వాదించాడు టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్‌ కూల్‌ ఎంఎస్‌ ధోని.

తనదైన శైలిలో ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చి జట్టును విజయాల బాట పట్టించాడు ఈ చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌. అచ్చంగా అలాగే.. ధోని మాదిరిగానే తమిళనాడు క్రికెటర్‌ షారూఖ్‌ ఖాన్‌ సైతం.. చివరి బంతికి సిక్సర్‌ బాది తమ జట్టుకు విజయం అందించాడు.

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని తమిళనాడు కైవసం చేసుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన టైటిల్ మ్యాచ్‌ లో తమిళనాడు 4 వికెట్ల తేడాతో కర్ణాటకపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక 20 ఓవర్లలో 151 పరుగులు చేయగా, తమిళనాడు చివరి బంతికి లక్ష్యాన్ని ఛేదించింది.

షారుక్‌ ఖాన్‌ ఆఖరి బంతికి సిక్సర్ కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు. తమిళనాడు చివరి బంతికి ఐదు పరుగులు చేయాల్సి ఉండగా ప్రతీక్ జైన్ బౌలింగ్‌లో షారుఖ్ ఖాన్ సిక్సర్ బాదాడు. షారుక్ ఖాన్ 15 బంతుల్లో 33 పరుగులు చేసి నాటౌట్‌ గా నిలిచాడు. షారుక్ తన వేగవంతమైన ఇన్నింగ్స్‌లో 3 సిక్సర్లు, ఒక ఫోర్ ఉంది. ఒత్తిడితో కూడిన క్షణాల్లో షారుఖ్ ఖాన్ ఆటతీరు అద్భుతం. తమిళనాడు విజయంలో షారుక్‌ తో పాటు ఆర్‌ సాయి కిషోర్‌ కూడా బాగా ఆడాడు.

ఈ మ్యాచ్‌ లో కర్ణాటక సులువుగా గెలిచే గెలిచే అవకాశం ఉంది కానీ తమిళనాడు చివరి రెండు ఓవర్లలో ఆటను మార్చేసింది. ఆఖరి ఓవర్‌లో తమిళనాడుకు 16 పరుగులు కావాలి. కర్ణాటక కెప్టెన్ మనీష్ పాండే బంతిని ప్రతీక్ జైన్ చేతికి అందించాడు. దీనితో చివరి బంతికి 5 పరుగులు అవసరమైన సమయంలో షారుఖ్‌ ఖాన్‌ సిక్స్‌ కొట్టడంతో విజయం ఖరారైంది.

ఈ నేపథ్యంలో తలా ధోని షారుఖ్‌ షాట్‌ను వీక్షిస్తున్న దృశ్యాలను చెన్నై సూపర్‌కింగ్స్‌ ఫ్రాంఛైజీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ధోని తరహాలో ఫినిషింగ్‌’’ అంటూ హర్షం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌ అవుతోంది. ఇక పంజాబ్‌ కింగ్స్‌ సైతం తమ జట్టు ఆటగాడి అద్భుత విజయాన్ని అంకితం ఇస్తూ... నువ్వు అందరి మనసులు గెలిచావు అంటూ ఆనందాన్ని పంచుకుంది.