Begin typing your search above and press return to search.
తొలి వికెట్ కీపర్ గా ధోనీ ప్రపంచరికార్డు
By: Tupaki Desk | 9 July 2019 12:18 PM GMTభారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్.... సీనియర్ ఆటగాడు, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించాడు. తాజాగా భారత్ ఇంగ్లాండ్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో న్యూజిలాండ్ తో భారత్ ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ధోనీకి 350 వన్డే. దీంతో 350 వన్డే మ్యాచ్ లు ఆడిన తొలి కీపర్ గా ధోనీ రికార్డు పుటల్లోకి ఎక్కాడు. ఇప్పటివరకు శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర పేరిట ఉన్న రికార్డును ధోనీ తుడిచిపెట్టాడు. గతంలో సంగక్కర 360 వన్డే మ్యాచ్ లకు కీపర్ గా ఉన్నా... అందులో 44 వన్డేలకు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ గా ఉండటం విశేషం.
ధోని ఇప్పటికే తన క్రీడా జీవితంలో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. భారత్ కు వన్డే ప్రపంచకప్ - ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ - 20 - 20 ప్రపంచకప్ ను అందించిన కెప్టెన్ గా రికార్డులకెక్కాడు. వివిధ ఫార్మాట్లలో ఉన్న ఈ మూడు ఐసీసీ టోర్నమెంట్లలోనూ భారత్ కప్ గెలుచుకోవడంలో ధోని పాత్ర ఎంతో కీలకం. ఈ క్రమంలోనే తాజా మ్యాచ్లో ధోనీ మరో రికార్డు కూడా తన అకౌంట్లో వేసుకున్నాడు.
భారత క్రికెట్ జట్టు దిగ్గజం సచిన్ టెండుల్కర్ (463) మ్యాచ్ ల తర్వాత ఎక్కువ వన్డేలు ఆడిన క్రికెటర్ గా కూడా ధోనీ రికార్డుల్లో నిలిచాడు. ఇక ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ఎక్కువ వన్డేలు ఆడిన పదో క్రికెటర్ గా ఉన్నాడు. ఇక ధోనీ 2004 డిసెంబర్లో బంగ్లాదేశ్ తో జరిగిన మూడు వన్డే మ్యాచ్ ల టోర్నమెంట్లో అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ధోనీ తాను ఆడిన తొలి వన్డేలో తొలి బంతికే డకవుట్ అయ్యాడు.
అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగి భారత క్రికెట్ జట్టుకు సారధ్య బాధ్యతలు నిర్వహించడంతో పాటు ఎన్నో మధురమైన విజయాలు అందించాడు. ఇక ధోనీ బెస్ట్ ఫినిషర్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 37 సంవత్సరాలకు చేరువ అయిన ధోనీ తాజా ప్రపంచకప్ లో మాత్రం అభిమానులు ఆశించినట్టుగా ఆడలేకపోతున్నాడు. ఇక సెమీఫైనల్, ఫైనల్లో అయినా తన విశ్వరూపం చూపించి.. 2011 ఫైనల్లో భారత్ కప్ అందించినట్టుగా మరో కప్ విజయంలో కీలకపాత్ర పోషిస్తాడేమో ? చూడాలి.