Begin typing your search above and press return to search.

ధోని గ్లౌజ్ లోగో వివాదం ఏమిటి? ఇప్పుడేం జ‌రుగుతోంది?

By:  Tupaki Desk   |   7 Jun 2019 10:07 AM GMT
ధోని గ్లౌజ్ లోగో వివాదం ఏమిటి? ఇప్పుడేం జ‌రుగుతోంది?
X
ప్ర‌పంచ క‌ప్ టోర్నీలో భాగంగా ఇటీవ‌ల జ‌రిగిన మ్యాచ్ లో మ‌హేంద్ర‌సింగ్ ధోని కీపింగ్ గ్లౌజ్ మీద ఉన్న బ‌లిదాన్ బ్యాడ్జ్ లోగో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపై పాక్ మంత్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌టం.. మ‌రోవైపు భార‌తీయులు ధోనీకి మ‌ద్ద‌తుగా నిలిచారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ లోగోను తీసివేయాల్సిందిగా ఐసీసీ ప్ర‌క‌టిస్తే.. అలాంటి అవ‌స‌రం లేద‌ని.. ఆ లోగోను కంటిన్యూ చేయాలంటూ ధోనీకి మ‌ద్ద‌తుగా నిలిచింది బీసీసీఐ. అంతేకాదు..ఐసీసీతో తాము మాట్లాడ‌తామ‌ని చెబుతోంది.

ఇంత‌కీ ఈ ఇష్యూ ఏమిటి? ఇప్పుడేం జ‌రుగుతుంద‌న్న‌ది చూస్తే.. ప్ర‌పంచ‌క‌ప్ ఆరంభ మ్యాచ్ లో భాగంగా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగి టీమిండియా మ్యాచ్ సంద‌ర్భంగా ఫెలుక్ వాయోను ధోనీ స్టంపౌట్ చేశారు ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేతికున్న కీపింగ్ గ్లౌజ్ మీద బ‌లిదాన్ బ్యాడ్జ్ లోగో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.ఇది కాస్తా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికి కార‌ణంగా ధోనీ కీపింగ్ గ్లౌజ్ మీదున్న లోగోను తొల‌గించాల‌ని పాక్ మంత్రి కోర‌ట‌మే దీనికి కార‌ణం.

ఇంత‌కీ ఆ లోగో క‌థేమిటంటే.. ప్ర‌త్యేక ద‌ళాల విల‌క్ష‌ణ చిహ్నంగా బ‌లిదాన్ బ్యాడ్జ్ ను చెప్పొచ్చు. పారాచూట్ రెజిమెంట్ లో ఒక భాగంగా ఈ లోగోను చెప్పాలి.రెండుక‌త్తులు క‌నిపించేలా ఉండే ఈ చిహ్నంపై దేవ‌నాగ‌రి లిపిలో బ‌లిదాన్ అని రాసి ఉంటుంది. పారామిలిట‌రీ క‌మాండోలు మాత్ర‌మే ఈ బ్యాడ్జ్ ధ‌రించ‌టానికి అనుమ‌తిస్తారు. 2011లో ధోని పారాచూట్ రెజిమెంట్ లో గౌర‌వ లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ హోదా పొందారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న కీపింగ్ గ్లౌజ్ మీద బ‌లిదాన్ బ్యాడ్జ్ లోగో ఉంది.

ఈ లోగుపై అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన పాక్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ మంత్రి ఫ‌వాద్ చౌద‌రి ట్విట్ట‌ర్ లో ట్వీట్ చేశారు. ధోని ఇంగ్లండ్ లో క్రికెట్ ఆడుతున్నారు. కానీ యుద్ధం చేయ‌టం లేదు. ఈ వ్య‌వ‌హారంపై భార‌త్ లోని ఒక వ‌ర్గం మీడియా అన‌వ‌స‌ర రార్దాంతం చేస్తోంది. ఓ పిచ్చి చ‌ర్చ‌కు తెర లేపుతూ.. యుద్ధం జ‌రుగుతున్న‌ట్లుగా చిత్రీకరిస్తున్నారు. వారిని వెంట‌నే సిరియా.. అఫ్గానిస్తాన్.. రావండాకు పంపాలంటూ ఆగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శించారు.

ఇదిలా ఉంటే.. ఈ బ్యాడ్జ్ మీద ఐసీపీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ ఫ‌ర్లాంగ్ ప్ర‌క‌ట‌న చేస్తూ.. ఐసీసీ రూల్ ప్ర‌కారం అంత‌ర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ల్లో ఆట‌గాళ్ల దుస్తులు.. కిట్ సామాగ్రిపై జాతి.. మ‌త‌.. రాజ‌కీయ సందేశాత్మ‌క గుర్తులు ఉండ‌రాద‌ని.. ఈ క్ర‌మంలో ధోనీ గ్లౌజ్ మీద ఉన్న లోగోను తీయాల‌ని బీసీసీఐను కోరిన‌ట్లుగా చెప్పారు.

ఈ ఉదంతంపై తాజాగా బీసీసీఐ స్పందించింది. ధోనీకి మ‌ద్ద‌తుగా నిలిచింది. ధోనీ ఆ గ్లౌజులు ధ‌రించేందుకు ఇంత‌కు ముందే ఐసీసీ అనుమ‌తి కోరిన‌ట్లుగా బీసీసీఐ పాల‌క‌వ‌ర్గ చీఫ్ వినోద్ రాయ్ వెల్ల‌డించారు. ఈ అంశంపై ఐపీఎల్ ఛైర్మ‌న్ రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. ఈ అంశంపై ఐసీసీ అభ్యంత‌రం తెల‌పాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

బ‌లిదాన్ గుర్తులు క‌లిగిన గ్లౌజులు ధ‌రించేందుకు ధోనికి అనుమ‌తి ఇవ్వాల‌ని.. ఇందులో ఎలాంటి వాణిజ్య అంశాలు లేవ‌ని.. ఇది కేవ‌లం జాతి గౌర‌వ‌మ‌ని పేర్కొన్నారు. ఈ అంశం విష‌యంలో ఐసీసీ ఎలాంటి అభ్యంత‌రాలు ఉండ‌వ‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉంటే.. భారత్‌లో ధోనీకి పెద్ద సంఖ్యలో అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. #DhonikeepTheGlove అనే హ్యాష్‌ట్యాగ్‌ ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మ‌రి.. ఐసీసీ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.