Begin typing your search above and press return to search.

'ఏసు క్రీస్తు కృప వల్లే కరోనా నుంచి బయటకు'.. వ్యాఖ్యల దుమారంపై 'డీహెచ్' క్లారిటీ

By:  Tupaki Desk   |   22 Dec 2022 5:45 AM GMT
ఏసు క్రీస్తు కృప వల్లే కరోనా నుంచి బయటకు.. వ్యాఖ్యల దుమారంపై డీహెచ్ క్లారిటీ
X
కరోనా వేళ టీవీలో అతి ఎక్కువగా కనిపించి అందరికీ చేరువైన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కుకున్నారు. క్రిస్మస్ సంబరాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించిన 'సెమీ క్రిస్మస్' వేడుకల్లో డీహెచ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

బహిరంగ ప్రసంగాలలో 'దేవుడు' అనే పదం ఎప్పుడూ సమస్య కాదు. కానీ కొన్ని మతాలకు సంబంధించిన దేవుళ్ల పేర్లు చెప్పగానే సమాజం సందిగ్ధంలో పడింది. ప్రస్తుతం దేశంలో బీజేపీ అధికారంలో ఉండడంతో హిందుత్వానికి పెద్దపీట ఉంది. ఇతర మతాల వారు బహిరంగంగా మాట్లాడితే ఆంక్షలు ఎదురు తిరగడాలు మొదలవుతున్నాయి. కాబట్టి సాధారణంగా తెలివిగలవారు ఏదైనా చెప్పే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు.

తెలంగాణ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ గాడాల శ్రీనివాసరావు మాట్లాడుతూ - "భారతదేశంలో లేదా తెలంగాణలో ఆధునిక సంస్కృతికి వారసులు ఎవరైనా ఉంటే, అది క్రైస్తవులే,. ప్రతి ఒక్కరూ దాని గురించి తెలుసుకోవాలి. , యేసు ప్రభువు కారణంగా కోవిడ్-19 తగ్గింది" అని వీడియోల సాక్షిగా యేసు వల్లే కరోనా తగ్గిందని స్పష్టం చేశారు. ఇది ఇతర మతాల వారికి బాగా నచ్చకపోవడంతో వివాదం రేగింది.

వెంటనే శ్రీనివాసరావు ఇది వివాదం కావడంతో క్లారిటీ ఇచ్చారు. 'మీడియా నా మాటలను వక్రీకరించిందని డీహెచ్ తెలిపారు. కొన్ని మీడియా సంస్థలు నా ప్రసంగంలోని కొంతభాగం కట్ చేసి వివాదం సృష్టించాయి. క్రీస్తువల్లే కరోనా సమసిపోయిందని అర్థం వచ్చేలా క్లిప్ కట్ చేసి ప్లే చేస్తున్నారు. ఇలా ప్రచారం చేయడం దురదృష్టకరం. నేను ఏ మతాన్ని కించపరచను. అన్ని మతాలను ఒకేలా చూస్తాను. సర్వమతసారం ఒక్కటే అని నమ్ముతాను' అని డీహెచ్ క్లారిటీ ఇచ్చారు.

చివరగా, శ్రీనివాస్ రావు మాట్లాడుతూ, ఇది తప్పుడు ప్రచారమని, ఆధునిక సంస్కృతి మరియు క్రైస్తవుల గురించి తాను ఎప్పుడూ చెప్పలేదని అన్నారు.

నిజానికి తెలంగాణలో ఇది జరిగినంత గందరగోళంగా మారలేదు. ఏపీలో అలా జరిగి ఉంటే సీఎం క్రిస్టియన్ మతానికి చెందిన వాడు కాబట్టి దీన్ని రాజకీయం చేసేందుకు ఎల్లో మీడియా కేసు వేసేది. నానా యాగీ చేసేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.