Begin typing your search above and press return to search.
సండ్రకు ఇవ్వాల్సింది ధూళిపాళ్లకు ఇవ్వబోయారా?
By: Tupaki Desk | 24 Jun 2015 9:11 AM GMTఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ ఏసీబీ అధికారులు అత్యుత్సాహంతో వ్యవహరించారన్న వాదనను రుజువు చేసేలా తెలుగుదేశం నేతలు సరికొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతం ఇప్పుడు తెలంగాణ ఏసీబీకి కాస్తంత ఇబ్బందికరంగా మారుతుందని చెబుతున్నారు.
ఓటుకు నోటు వ్యవహారంలో నోటీసులు ఇచ్చేందుకు ఆ మధ్య ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు నోటీసులు ఇచ్చేందుకు హైదర్‌నగర్‌లోని ఆయన కార్టర్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. మీడియాలో వచ్చిన వార్తల్లో అధికారులు ఆయన ఇంటికి వెళ్లటం.. ఇంటికి తాళం కప్ప ఉండటంతో.. కిటికీలో నుంచి నోటీసులు జారవిడిచి రావటం.. తర్వాతి రోజు కూడా తాళం వేసి ఉండటంతో తలుపు పక్కనున్న గోడకు నోటీసులు అతికించి రావటం మాత్రమే బయటకు వచ్చింది.
అయితే మీడియాలోకి వచ్చిన దానికి భిన్నంగా విషయం మరికాస్త జరిగిందని చెబుతున్నారు. మొదట నోటీసులు ఇవ్వటానికి వెళ్లిన సందర్భంలో సండ్ర ఇంటిని తట్టాల్సిన ఏసీబీ అధికారులు.. పక్కనే ఉన్న ఏపీ టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఇంటి తలుపును తట్టారట. ఆయన సహాయకులు తలుపు తీసిన వెంటనే.. ఒక అధికారి లోపలికి దూసుకొచ్చారట.
ఇది సండ్ర ఇల్లు కాదని.. చెప్పినా మొదట వినిపించుకోలేదని.. తర్వాత విషయం అర్థమై నాలుక కర్చుకొని వెళ్లినట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ధూళిపాళ్ల నరేంద్ర. తెలంగాణ ఏసీబీ అధికారులకు సభాహక్కుల నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఒక ఎమ్మెల్యే ఇంటికి అర్థరాత్రి సమయంలో రావటానికి స్పీకర్ అనుమతి ఉండాలని.. అదేమీ లేకుండా రావటమే కాదు.. సంబందం లేని వారిని ఇబ్బంది పెట్టటం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే ఈ అంశాన్ని ఏపీ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. ఈ విషయంపై ఏపీ సర్కారు సీరియస్‌గా తీసుకొని.. నోటీసులు ఇస్తే.. మరో ఇష్యూ మొదలైనట్లేనని చెబుతున్నారు. అయినా.. నోటీసులు ఇచ్చే విషయంలో కాస్త ముందు వెనుకా చూసుకొని.. క్రాస్ చెక్ చేసుకొని ఇంటి తలుపు తట్టరా? తాము వెళ్లేది ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి ఇంటికన్న విషయం ఏసీబీ అధికారులు మర్చిపోవటం ఏమిటి..?