Begin typing your search above and press return to search.

గాలి కాలుష్యంతో డయాబెటిస్, గుండె జబ్బులు

By:  Tupaki Desk   |   30 Aug 2020 1:30 AM GMT
గాలి కాలుష్యంతో డయాబెటిస్, గుండె జబ్బులు
X
గాలి కాలుష్యం కారణంగా ఎన్నో అనర్థాలు తలెత్తుతున్నాయి. ఎయిర్ పొల్యూషన్ తో ఇన్సులిన్ రెసిస్టెన్స్, టైప్ 2 డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉందని తాజాగా వైద్య నిపుణులు వెల్లడించారు. గుండె జబ్బులతో పాటు స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా ఉంది. గాలి కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలతో పోలిస్తే.. కాలుష్యం లేని ప్రాంతాల్లో వ్యాధుల బారిన పడేవారు తక్కువని వైద్య నిపుణులు చెబుతున్నారు. పొల్యూషన్ ఉన్న గాలిని పీల్చడం వల్ల ఆస్తమా బారిన పడే అవకాశం ఉంది. చిన్న పిల్లల్లో ఊపిరితిత్తులు సరిగా అభివృద్ధి చెందవు. ఊపిరి తిత్తులు ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం కూడా ఉంది. గర్భిణులు ఇటువంటి గాలి పీల్చుకోవడం వల్ల పిల్లలు తక్కువ బరువుతో పుడతారు. లంగ్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దగ్గు ఆయాసం వంటి సమస్యలు చుట్టు ముడతాయి.

కొన్ని సందర్భాల్లో అకాల మరణం కూడా సంభవించొచ్చు. వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేయకపోతే భవిష్యత్తులో మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రజలు ముందుకు రావాలి. వాహనాల వాడకం తగ్గించడంతోపాటు.. ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో విరివిగా మొక్కలు నాటి పెంచాలి. వాతావరణాన్ని ఎక్కువగా కాలుష్యానికి గురిచేసే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి. సాధ్యమైనంతవరకు గుడ్డ సంచులు వాడితే మరింత మేలు. వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ పద్ధతుల్లో సాగు చేపట్టడం, రీసైక్లింగ్ ప్రొడక్టులను వినియోగించడం వంటివి చేయాలి. ముఖ్యంగా పొగ త్రాగే అలవాటు ఉంటే దానికి దూరంగా ఉండడం మరీ మంచిది. ఇంట్లో ఏసీలు, వాషింగ్ మిషన్లు సాధ్యమైనంత తక్కువగా వాడుకొంటూ సోలార్ పవర్ వాడకాన్ని మొదలు పెట్టాలి. అడవుల నరికివేత అరికట్టి, నిప్పు బారిన పడకుండా చూసుకుంటే వాతావరణంలో కాస్త అయిన కాలుష్యాన్ని తగ్గించవచ్చు.