Begin typing your search above and press return to search.

నిద్రలేమి సమస్యతో మధుమేహం వస్తోందట.. జాగ్రత్త సుమీ!

By:  Tupaki Desk   |   10 April 2022 11:30 PM GMT
నిద్రలేమి సమస్యతో మధుమేహం వస్తోందట.. జాగ్రత్త సుమీ!
X
మనిషికి సరిపోయేంత నిద్ర లేకపోతే ఎన్నెన్నో సమస్యలు చుట్టుముడుతాయి. చాలా మందికి నిద్ర లేకపోతే తలనొప్పి వికారం వస్తుంటాయి. మరికొంత మందికి జ్వరం.. ఇతర సమస్యలు వంటివి కూడా వస్తుంటాయి. అయితే ముఖ్యంగా మధుమేహానికి నిద్రకు విడదీయరాని సంబంధం ఉంది. ఎందుకుంటే మధుమేహం గల వారికి కచ్చితంగా కంటినిండా నిద్ర ఉండాలి.

మధుమేహులకు ఒకరోజు నిద్ర లేకపోయినా రక్తంలో గ్లూకోజు స్థాయులపై విపరీత ప్రభావం ఏర్పడుతుంది. నిద్ర సరిగ్గా పోకపోతే.. గ్లూకోజును నియంత్రించే హార్మోన్ల తీరు తెన్నులన్నీ మారిపోతాయి. వీటిల్లో ముందుగా చెప్పుకోవాల్సింది ఇన్సులిన్‌ గురించి. గాఢ నిద్రలోనే ఇన్సులిన్‌ ఉత్పత్తి తీవ్ర స్థాయికి చేరుకుంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒక వేళ కంటి నిండా నిద్ర లేకపోతే... ఇన్సులిన్‌ అంతగా ఉత్పత్తి కాదు.

మరోవైపు నిద్ర లేమితో ఇన్సులిన్‌ నిరోధకత కూడా తలెత్తుంది. ఇది థైరాయిడ్ కల్గజేసే హార్మోన్ ను ప్రేరపిస్తుంది. అలాగే థైరాయిడ్‌ను ప్రేరేపించే హార్మోన్, టెస్టోస్టిరాన్ హార్మోన్‌ దోహదం చేస్తాయని చెప్పుకోవచ్చు. కణాలు గ్లూకోజును స్వీకరించేలా చేసేది ఇన్సులినే. ఇన్సులిన్‌ నిరోధకత తలెత్తితే కణాలు గ్లూకోజును స్వీకరించవు. ఫలితంగా గ్లూకోజు స్థాయులు పెరిగిపోతాయి.

నిద్రలేమితో ఒత్తిడిని పెంచే కార్టిజోల్‌ హార్మోన్‌ సైతం ఉత్పత్తి అవుతుంది.ఇది గ్లూకోజు స్థాయులు పెరిగేలా చేయటమే కాదు, క్లోమంలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే బీటా కణాల పనితీరునూ తగ్గిస్తుంది. వీటితోనే అయిపోలేదు. నిద్రలేమితో కడుపు నిండిందనే సంకేతాలిచ్చే లెప్టిన్‌ హార్మోన్‌ స్థాయులు తగ్గిపోతాయి. దీని వల్ల ఒకవైపు ఆకలి పెరుగుతుంది. మరోవైపు కడుపు నిండినచ్లు అనిపించదు. దీని వల్ల విపరీతమైన బరువు పెరిగిపోయి స్లీప్ అప్నియా ముప్పు పెరుగుతుంది.

అంతే కాకుండా దేహానికి సరిపడా నిద్ర లేకపోవడం వల్ల టైప్ 2 యాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందని యూకే శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. నిద్ర సమస్యలు అరుదుగా ఉండేవారి కంటే సరిగా నిద్రపోకుండా ఉండే వారిలో అధిక బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగి టైప్ 2 డయాబెటిస్ ను వృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని గుర్తించారు. అలాగే నిద్రలేమి సమస్యలను తగ్గించుకుంటే తప్ప మధుమేహానికి చెక్ పెట్టలేరని వివరించారు.