Begin typing your search above and press return to search.

శివసేన, బీజేపీ మధ్య డైలాగ్ వార్

By:  Tupaki Desk   |   25 Jan 2022 6:30 AM GMT
శివసేన, బీజేపీ మధ్య డైలాగ్ వార్
X
శివసేన-బీజేపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. కమలం పార్టీపై ఒంటికాలితో లేస్తున్నారు శివసేన లీడర్లు. అసలు బీజేపీకి పదవిని తామే ఇచ్చామని శివసేన నేతలు అంటున్నారు.

బీజేపీ కూటమి ఎన్డీఏలో తమ పార్టీ 25 ఏళ్ల కాలాన్ని వృథా చేసిందన్నారు శివసేన పార్టీ చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే. శివసేన హిందూత్వానికి అధికారం అందించేందుకు బీజేపీతో జతకట్టిందని.. కానీ అధికారం కోసం హిందుత్వాన్ని ఎన్నడూ వాడుకోలేదన్నారు ఉద్దవ్.

అధికారం కోసం మిత్రులను వాడుకొని వదిలేసే అవకాశవాదం బీజేపీకే ఉందని మహారాష్ట్ర సీఎం ఘాటుగా విమర్శించాడు. జాతీయ స్థాయిలో ఉండాలనుకుంటున్న బీజేపీ లక్ష్యానికి తాము సహకరిస్తే తమను వెన్నుపోటుపొడించిందని ఉద్దవ్ ఫైర్ అయ్యారు. బీజేపీని వీడినప్పటికీ హిందుత్వాన్ని తమ పార్టీ వదలుకోలేదని ఆరోపించారు. భవిష్యత్తులో శివసేన జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు.

సీఎం ఉద్దవ్ కామెంట్స్ ను శివసేన కీలక నేత సంజయ్ రౌత్ సపోర్టు చేశారు. హిందుత్వ సిద్ధాంతాన్ని శివసేన ఎప్పుడూ అధికారం కోసం వాడలేందటూ ఉద్దవ్ చేసిన వ్యాఖ్యలను సంజయ్ పూర్తిగా సమర్థించారు.

మహారాష్ట్రలో ఎక్కడో అడుగున ఉన్న బీజేపీని ఉన్నతస్థాయికి తీసుకొచ్చిన ఘనత శివసేనదేనన్నారు. బాబ్రీ ఉదంతం తర్వాత ఉత్తర భారత్ లో శివసేన పవనాలు బలంగా వీచాయని.. అలాంటి దశలోనే తాము ఎన్నికలకు వెళ్లి ఉంటే శివసేన నేతనే ప్రధాని అయ్యేవారని సంజయ్ కామెంట్ చేశారు. శివసేన కామెంట్స్ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. దీనిపై బీజేపీ ఎలా స్పందిస్తుందన్నది వేచిచూడాలి.