Begin typing your search above and press return to search.
'డైమండ్ డక్'.. ఈ ఐపీఎల్ లో వరుసగా ఇద్దరు కెప్టెన్లు.. కోహ్లి మూడో గోల్డన్ డక్
By: Tupaki Desk | 9 May 2022 11:30 AM GMTక్రికెట్ లో అత్యంత అవమానకరమైనది "డకౌట్". ఇప్పుడు వేయడం లేదు కానీ.. గతంలో అంటే ఓ 20 ఏళ్ల కిందటివరకు ఆటగాడు డకౌట్ అయి పెవిలియన్ చేరేటప్పుడు టీవీ తెర మీద తలొంచుకుని వెళ్లిపోతున్న డక్ (బాతు) బొమ్మను సింబాలిక్ గా వేసేవారు. మరీ తొలి బంతికే ఔటైన వారికి మొదట్లో ఇలా డక్ బొమ్మ వేసినా.. తర్వాత కొన్ని రోజులు పరుగులేమీ చేయకుండానే ఔటైనవారికీ వేసినట్లు గుర్తు. అయితే, కాలక్రమంలో ఇంకా ఈ పాత పద్ధతి ఏమిటి అనుకున్నారో..? ఆటగాడికి అవమానకరం అనుకున్నారో ఏమో? డక్ బొమ్మ వేయడం మానేశారు. అయితే, డకౌట్ అనే పదం మాత్రం క్రికెట్ లాగే శాశ్వతంగా ఉండిపోయింది.
డకౌట్ లో రకాలు వేరయా?పరుగులేమీ చేయకుండా ఔటవడం డకౌట్ అయితే.. అందులోనూ అనే పేర్లున్న డకౌట్ లున్నాయి. టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్ లోనూ డకౌట్ అయితే పెయిర్ అంటారు. కాగా, డకౌట్ లలో గోల్డెన్, డైమండ్ అని ఇంకో రెండు రకాలున్నాయి. క్రీజులో స్ట్రయికింగ్ లో ఉంటూ ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయితే దానిని గోల్డెన్ డకౌట్ అంటారు. ఇక డైమండ్ డకౌట్ అంటే అసలు బంతిని ఆడకుండానే.. రనౌట్ కావడం. దీనికి స్ట్రయికింగ్ బ్యాట్స్ మన్ తో సమన్వయ లోపం, వికెట్ల మధ్య చురుగ్గా పరిగెత్తలేకపోవడం.. స్ట్రయికింగ్ బ్యాట్స్ మన్ బంతిని స్ట్రయిట్ గా ఆడినప్పుడు బౌలర్ చేతికి తగిలి.. నాన్ స్ట్రయికర్ క్రీజు బయట ఉండడం కారణంగా ఔట్ కావడం వంటి కారణాలున్నాయి.
వరుసగా ఇద్దరు కెప్టెన్లు ఈ ఐపీఎల్ లో వరుసగా ఇద్దరు కెప్టెన్లు డైమండ్ డకౌటయ్యారు. ఆదివారం బెంగళూరుతో మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, కోల్‌కతా నైట్ రైడర్స్ తో శనివారం జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ డైమండ్ డక్ గా వెనుదిరిగారు. గతంలోనూ లీగ్‌లో కొందరు కెప్టెన్లు డైమండ్ డక్ అయ్యారు. 2008 ఆరంభ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ ను విజేత గా నిలిపి సంచలనం రేపిన రాజస్థాన్ మాజీ కెప్టెన్, దివంగత స్పిన్ దిగ్గజం షేన్‌వార్న్ డైమండ్ డక్ రికార్డుల్లో చేరిన లీగ్ జట్టు తొలి కెప్టెన్. 2009లో ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్‌లో సనత్ జయసూర్య బౌలింగ్ లో జరిగిందీ ఘటన. వార్న్ నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న వార్న్.. హర్భజన్ వేసిన త్రోకు రనౌటయ్యాడు. 2010లోనూ వార్న్ డైమండ్ డక్ అయ్యాడు. చెన్నైతో మ్యాచ్‌లో రాజస్థాన్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో బరిలోకి వచ్చిన అతడు 19.4 ఓవర్‌కు నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్నాడు. అప్పుడు తులాన్ తుషార వేసిన బంతికి సుమిత్ నర్వాల్ డీప్ పాయింట్ దిశగా షాట్ ఆడి సింగిల్ తీశాడు. అయితే, వార్న్ అనవసరంగా రెండో పరుగుకు యత్నించి రనౌటయ్యాడు.
గంభీర్ సైతం..టీమిండియా పగ్గాలు దక్కకున్నా.. కోల్ కతాను రెండుసార్లు ఐపీఎల్ విజేతగా (2012, 2014) నిలిపాడు గౌతమ్ గంభీర్. 2013లో ఢిల్లీ మ్యాచ్‌లో ఒక్క బంతినీ ఆడకుండానే పెవిలియన్ చేరాడు. కోల్‌కతా ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్ చేయగా.. మన్విందర్ బిస్లా రెండో బంతిని స్ట్రైట్‌డ్రైవ్ ఆడాడు. అది వెళ్లి నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న గంభీర్ ప్యాడ్లకు తగలడంతో అతడు సింగిల్ కోసం పరుగెత్తాడు. బంతి అందుకున్న ఇర్ఫాన్ నేరుగా కీపర్‌వైపు విసిరాడు. అది వికెట్లకు తాకడంతో గంభీర్ రనౌటయ్యాడు.గతేడాది ఇదే కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా ఉన్న మోర్గాన్ కూడా డైమండ్ డకౌటయ్యాడు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో మోరిస్ బౌలింగ్‌లో రాహుల్ త్రిపాఠి స్ట్రైట్‌డ్రైవ్ ఆడాడు. ఆ బంతి నేరుగా వెళ్లి నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లోని వికెట్లకు తాకగా.. మోర్గాన్ క్రీజుదాటి ముందుకు వచ్చాడు. అక్కడే ఉన్న మోరిస్ బంతిని అందుకొని నాన్‌స్ట్రైకింగ్‌లోనే వికెట్లను కొట్టాడు.
రాహుల్.. విలియమ్సన్..కేకేఆర్ తో శనివారం మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఒక్క బంతీ ఆడకుండానే పెవిలియన్ చేరాడు. సౌథీ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఐదో బంతిని.. డికాక్ ఎక్స్‌ట్రా కవర్స్‌లోకి కొట్టాడు. కేకేఆర్ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ బంతిని నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో వికెట్లకేసి విసిరాడు. అప్పటికే క్రీజువదిలి ముందుకు వచ్చిన రాహుల్ రనౌటయ్యాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇలాగే ఔటయ్యాడు. మరీ ఇన్నింగ్స్ తొలి ఓవర్ తొలి బంతికే నాన్‌స్ట్రైకర్‌గా ఉన్న విలియమ్సన్ ఔటయ్యాడు. మాక్స్‌వెల్ వేసిన ఇన్నింగ్స్ మొదటి బంతిని అభిషేక్ శర్మ కవర్స్‌లోకి ఆడగా.. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న షాబాజ్ అహ్మద్ బంతిని అందుకొని నేరుగా కీపర్ వైపు వికెట్లకేసి విసిరాడు. విలియమ్సన్ క్రీజులో బ్యాట్ పెట్టిన సమయానికి బంతి వికెట్లకు తాకింది. అయితే, అది అంపైర్ నిర్ణయం ప్రకారం ఔటిచ్చాడు.
కోహ్లీ మరో గోల్డన్ డక్.. ఈ లీగ్ లో మూడోది డైమండ్ డక్ ల గురించి చెప్పుకొన్నాం కదా..? టీమిండియా అగ్రశ్రేణి బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి గోల్డన్ డక్ ల పరంపర గురించీ చెప్పుకోవాలి. సీజన్ లో మూడో గోల్డన్ డక్ కోహ్లి ఖాతాలో చేరింది. ఆదివారం హైదరాబాద్ తో మ్యాచ్ లో కోహ్లి ఎదుర్కొన్న తొలి, ఇన్నింగ్స్ తొలి బంతికే ఔటయ్యాడు. గత ఆరు మ్యాచ్ ల్లో కోహ్లికిది మూడో డకౌట్ (గోల్డన్ డకౌట్) కావడం గమనార్హం