Begin typing your search above and press return to search.

డైమాండ్ మాస్క్ లు.. జస్ట్ రూ.4 లక్షలే..

By:  Tupaki Desk   |   12 July 2020 2:30 AM GMT
డైమాండ్ మాస్క్ లు.. జస్ట్ రూ.4 లక్షలే..
X
వెర్రి వేయి విధాలంటారు. కరోనా నుంచి కాపాడుకోవడానికి ఎన్95 మాస్కులు ఉత్తమం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవి 200 రూపాయల లోపే దొరుకుతున్నాయి. కరోనా నుంచి మనల్ని కాపాడుతాయి. కానీ కొందరు ధనికులు.. డబ్బున్న వాళ్లు మాస్క్ ల్లోనూ భారీతనం చూపిస్తున్నారు.

ఇప్పటికే పూణేలో ఓ వినియోగదారుడు 2.89 లక్షల రూపాయల బంగారంతో తయారు చేసిన మాస్క్ ను తయారు చేసుకొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇప్పుడు నేనేమైనా తక్కువ తిన్నాన అని వజ్రాల సిటీ అయిన సూరత్ కు చెందిన ఒక ధనవంతుడు ఆభరణాలు.. వజ్రాలతో అలంకరించబడిన మాస్క్ లను తయారు చేయించుకున్నాడు. దీని ఏకంగా 4 లక్షల వరకు ఉంటుందని సమాచారం.

గత ఒక నెల రోజులుగా వజ్రాల పరిశ్రమకు కేంద్రమైన గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో ఆభరణాల దుకాణాలు బంగారం, వెండి, వజ్రాలు, అమెరికన్ వజ్రాలతో తయారు చేసిన ఫేస్ మాస్క్‌లను తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇప్పుడు ఆభరణాలకు డిమాండ్ పడిపోవడంతో మాస్క్ ల తయారీపై పడ్డారు. అనేక నమూనాలలో ఆభరణాల గీతలతో మాస్క్ లు అలరిస్తున్నాయి. ఆర్డర్ ఇచ్చిన వారికి నచ్చినట్టు డైమాండ్ మాస్క్ లను తయారు చేసి ఇస్తున్నారు. ఒక వ్యక్తి తన పెళ్లి కోసం దుస్తులతో సరిపోలే మాస్క్ ను అమెరికన్ వజ్రాలు, బంగారంతో తయారు చేశామని.. దీన్ని 1.5 లక్షలకు అమ్మినట్టు సూరత్ లోని బంగారం వ్యాపారి దీపక్ తెలిపాడు. వజ్రాలతో కూడిన బంగారు, తెలుపు బంగారు మాస్క్ లను ఒక్కొక్కటి రూ .4 లక్షలకు అమ్ముతున్నామని వివరించారు..

కస్టమర్లు వివిధ వేడుకలు, పెళ్లిళ్లు, ఇతర సందర్భాలలో ప్రత్యేకంగా కనిపించడం కోసం ఇలా లక్షలు పోసి తమ దుస్తులకు తగినట్టుగా లక్షలు పోసి తయారు చేయించుకుంటున్నారని సూరత్ వ్యాపారులు తెలిపారు.