Begin typing your search above and press return to search.

40 ఏళ్ల ముందే కొవిడ్ ప్రస్తావన.. ఆ పుస్తకమే సాక్ష్యం

By:  Tupaki Desk   |   18 Feb 2020 5:15 AM GMT
40 ఏళ్ల ముందే కొవిడ్ ప్రస్తావన.. ఆ పుస్తకమే సాక్ష్యం
X
ఈ మధ్యనే కొవిడ్ వైరస్ ను గుర్తిస్తే.. 40 ఏళ్ల ముందే దాని ప్రస్తావన ఎలా తెస్తారన్న ప్రశ్న మీకు కలగొచ్చు. కానీ.. ఇప్పుడు చెప్పేది తెలిస్తే.. అవాక్కు అవ్వటం ఖాయం. చైనాను ఆగమాగం చేస్తున్న ఈ పిశాచి వైరస్ కు చెక్ పెట్టే రోజు కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. అంతకంతకూ వ్యాపిస్తూ ఇప్పటివరకూ 1700 మంది ప్రాణాల్ని తీసిన ఈ వైరస్ కు పెట్టిన పేరు విన్నంతనే ఉలిక్కి పడాల్సిందే.

ఎందుకంటే ఆ వైరస్ కు సదరు పుస్తకంలో పెట్టిన పేరేమిటో తెలుసా? వుహాన్ 400 అని. ఇంతకీ ఆ పుస్తకం ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే.. అమెరికా కు చెందిన డీన్ కూంట్జ్ రాసిన ఐస్ ఆఫ్ డార్క్ నెస్ అనే సైన్స్ ఫిక్షన్ నవలలో.. కరోనా వైరస్ గురించి రాశారు. ఇందులో సదరు వైరస్ ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైనిదిగా అభివర్ణించటంతో పాటు.. వందశాతం మరణం ఖాయమని పేర్కొన్నారు.

ఒక లేబోరేటరీలో తయారైన ఒక జీవరసాయన ఆయుధంగా సదరు రచయిత తన పుస్తకం లో పేర్కొన్నారు. వుహాన్ 400గా పేర్కొనే ఈ వైరస్ తో వందశాతం మరణం తప్పనిసరి. దాంతో పోలిస్తే.. కోవిడ్ 19 వైరస్ అంత తీవ్రమైనది కాదని చెప్పారు. ఒక నెటిజన్ ఈ నవలను.. అందులో వుహాన్ వైరస్ ప్రస్తావన ఉన్న చోట.. గీతలు గీసి మరీ.. ఇమేజ్ ను పోస్టు చేయటం తో.. ఇది కాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది. ఏమైనా.. సదరు రచయిత కు హేట్సాఫ్ చెప్పాల్సిందే.