Begin typing your search above and press return to search.
ఏబీఎన్ రాధాకృష్ణ, రేవంత్‌రెడ్డి `లీక్ వీడియో` వాళ్లే రిలీజ్ చేశారా?
By: Tupaki Desk | 5 July 2021 7:44 AM GMTరాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. ఎప్పుడు ఎలాంటి ఎత్తులు తెరమీదికి వస్తాయో చెప్పడం కష్టం. అవసరం.. అవకాశం అనే రెండు విషయాలే.. రాజకీయాలను నేతలను ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే తెరమీదికి వచ్చింది. ఇటీవల ఏబీఎన్ మీడియా అధినేత రాధాకృష్ణ, ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపికైన రేవంత్ రెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గురించి మాట్లాడుకున్న వీడియో ఒకటి లీకైంది. ప్రస్తుతం ఇది సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
అయితే.. ఈ వీడియో ఎలా లీకైంది? ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేయించారా? లేక.. ఏం జరిగింది? అనే విషయం ఆసక్తిగా మారింది. ఈ ఆడియో లీక్ వెనుక పెద్ద ప్లాన్ ఉందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. టీడీపీకి తెలంగాణలో ఒకప్పుడు భారీ కేడర్ ఉండేది. ఎక్కడ చూసినా.. టీడీపీ శ్రేణులు కనిపించేవారు. అయితే.. రాష్ట్ర విబజన, తెలంగాణ వాదం తెరమీదికి రావడంతో వారంతా టీఆర్ ఎస్ గూటికి చేరిపోయారు. కానీ, ఆ పార్టీలో ఇమడ లేక పోతున్నారు. పోనీ.. బయటకు వచ్చి వేరే పార్టీలో చేరాలంటే.. కాంగ్రెస్ వీక్‌గా ఉంది.
దీంతో వారంతా విధిలేక టీఆర్ ఎస్‌లోనే ఉన్నారనే విషయం కొన్నాళ్లుగా ప్రచారంలో ఉంది. ఇప్పుడు వాళ్లను వెనక్కు తీసుకుకొని రావాలని చంద్రబాబు, లోకేష్ ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. అయితే.. వీరిని కాంగ్రెస్ నేత, టీడీపీ సానుకూల నేతగా ఉన్న రేవంత్ రెడ్డికి చేరువ చేయాలనేది ప్లాన్‌గా ఉంది. ఇలా చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో బీసీ ఓట్లను రేవంత్‌కు అనుకూలంగా మార్చాలనేది ప్రణాళికగా ఉందని తెలుస్తోంది.
ఇది సాధ్యమేనాఅంటే.. బీసీల్లో టీడీపీకి మంచి పట్టు ఉండేది. వారిని ఇప్పుడు రేవంత్‌కుచేరువ చేయడం ద్వారా.. పరోక్షంగా కేసీఆర్‌కు దెబ్బ కొట్టే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు ఆస్తులు హైదరాబాద్‌లో భారీగా ఉన్న నేపథ్యంలో మున్ముందు.. వాటికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే.. రేవంత్ వంటి సానుకూల నేతను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందనేది చంద్రబాబు ఆలోచనగా ఉందని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే బీసీలను, టీడీపీ మాజీ కార్యకర్తలనుఆయనకు చేరువ చేసే ఉద్దేశంతోనే తాజాగా ఏబీన్ రాధాకృష్ణ, రేవంత్‌ల ఆడియోను ఉద్దేశ పూర్వకంగానే లీక్ చేశారని అంటున్నారు. నిజానికి ఈ డిస్కషన్ ఏబీఎన్ మీడియాలో జరిగిందని.. దీనిని ఎవరూ లీక్ చేసే అవకాశం లేదని.. కావాలనే దీనిని లీక్ చేశారని పరిశీలకులు భావిస్తున్నారు.