Begin typing your search above and press return to search.

అఖిలేష్ మంచి పని చేశారా?

By:  Tupaki Desk   |   23 March 2022 6:32 AM GMT
అఖిలేష్ మంచి పని చేశారా?
X
సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మంచిపనే చేశారు. మొన్నటి ఎన్నికల్లో కర్నల్ అసెంబ్లీ నుండి మంచి మెజారిటితో అఖిలేష్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఎంఎల్ఏగా గెలిచే సమయానికే అఖిలేష్ ఆజంగఢ్ ఎంపీగా ఉన్నారు. దాంతో ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేస్తారా ? లేకపోతే ఎంపీగా రాజీనామా చేస్తారా అనే సందిగ్దత ఉండేది. అలాంటి సందిగ్దానికి అఖిలేష్ తెరదించారు.

తాను ఎంపీగా రాజీనామా చేసి ఎంఎల్ఏ గా ఉండేందుకు నిర్ణయించారు. అందుకనే ఎంపీ పదవికి రాజీనామా చేసేశారు. తన రాజీనామా లేఖను అఖిలేష్ లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు అందించారు. అలాగే రాంపూర్ ఎంపిగా ఉన్న అజంఖాన్ కూడా రాంపూర్ అర్బన్ ఎంఎల్ఏగా గెలిచారు. ఈయన ప్రస్తుతం సీతాపూర్ జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. విచిత్రమేమిటంటే అజంఖాన్ జైల్లో ఉండే గెలిచారు. అఖిలేష్ తో పాటు అజంఖాన్ కూడా ఎంపీ పదవికి రాజీనామా చేసేశారు.

తన రాజీనామాతో అఖిలేష్ మంచి పని చేశారనే అనుకోవాలి. ఎందుకంటే ఎంపీగా మూడేళ్ళ కాలమైపోయింది. ఇకుండేది మహా అయితే రెండేళ్ళే. ఇప్పటికిప్పుడు అఖిలేష్ ఎంపీగా ఉండి ఢిల్లీలో చేయగలిగేది కూడా ఏమీ లేదు.

అనేకమంది ప్రతిపక్ష ఎంపీల్లో అఖిలేష్ కూడా ఒకరంతే. అదే ఎంఎల్ఏగా ఉంటే ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది. పైగా ఈ క్యాబినెట్ ర్యాంకు ఐదేళ్ళుంటుంది.

ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడిన అఖిలేష్ ఎంఎల్ఏగా ఉంటేనే రాష్ట్రంలో జనాలకు దగ్గరగా ఉండే అవకాశముంటుంది. ఏ విధంగా చూసుకున్నా ఎంపీ పదవిలో ఉండి అఖిలేష్ చేయగలిగిందేమీ లేదు. ఇపుడు ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయటం ద్వారా వచ్చే ఉపఎన్నికల్లో మళ్ళీ ఎస్పీ అభ్యర్థులు గెలుస్తారనే నమ్మకం కూడా లేదు.

లోక్ సభ స్ధానాలకు జరగబోయే ఉపఎన్నికల్లో ఎస్పీ అభ్యర్ధులు గెలిచినా ఒకటే ఓడినా ఒకటే. కాబట్టి ఎంపీగా రాజీనామా చేసి ఎంఎల్ఏగానే కంటిన్యూ అవ్వాలని అఖిలేష్ తీసుకున్న నిర్ణయం మంచిదే.