Begin typing your search above and press return to search.

పెద్ద నోట్ల గొడవ.. అంబానీపై ఒక హాట్ రూమర్

By:  Tupaki Desk   |   11 Nov 2016 5:38 AM GMT
పెద్ద నోట్ల గొడవ.. అంబానీపై ఒక హాట్ రూమర్
X
పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఒక కలకలం రేగింది. దీని వల్ల జరిగే లాభ నష్టాల గురించి పెద్ద చర్చే నడుస్తోంది దేశంలో ప్రస్తుతం. తాత్కాలికంగా జనాలు ఇబ్బంది పడ్డా దీర్ఘ కాలంలో ఈ నిర్ణయం వల్ల లాభమే అన్నది మెజారిటీ అభిప్రాయం. ఐతే ఈ నిర్ణయం దేశంలోని బడా బాబులకు ముందే తెలుసు అన్న ప్రచారం కూడా ఒకటి నడుస్తోంది ప్రస్తుతం. పెద్ద తలకాయలన్నీ విషయం ముందే తెలుసుకుని అంతా సర్దుకున్నాకే మోడీ ఈ నిర్ణయం ప్రకటించాడన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ముఖేష్ అంబానీ లాంటి వాళ్లకు ఈ విషయం ముందే తెలుసట. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అయిన ఉర్జిత్ పటేలే ఆయనకు ముందే సమాచారం ఇచ్చారంటూ వాట్సాప్ సహా సోషల్ మీడియాలో ఒక హాట్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. దాని వివరాల్లోకి వెళ్తే..

ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ గవర్నురుగా ఎంపికైన ఉర్జిత్ పటేల్.. చాలా ఏళ్ల నుంచి ప్రభుత్వం తరపున పనిచేస్తూనే ప్రైవేటు రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నాడు. రిలయన్స్ సంస్ధ అధినేత ముఖేష్ అంబానీకి ఉర్జిత్ పటేల్ ఆప్తుడు. రిలయన్స్ పరిశ్రమల వ్యాపార అభివృద్ధి విభాగానికి అధ్యక్షుడిగా ఉర్జిత్ పనిచేసాడు. చాలా ఏళ్లుగా ముఖేష్ అంబానీకి ఫైనాన్షియల్ అడ్వైజర్ కూడా ఆయనే. కాబట్టి ఉర్జిత్ ఆర్బీఐ గవర్నర్ అయ్యాడు కాబట్టి.. ఆర్బీఐ తీసుకునే ప్రతి నిర్ణయం ముఖేష్ అంబానీకి తెలుసు అన్నది కొందరు చేస్తున్న వాదన. 500.. 1000 నోట్లు ఆపేస్తారని ముఖేష్ అంబానీకి ముందే తెలుసని.. అందుకే తన దగ్గరున్న బ్లాక్ మనీని వైట్ గా మార్చుకోవడానికి జియో నెట్ వర్క్ లాంచ్ చేశాడని.. ఇప్పుడు పెట్టిన పెట్టుబడి మొత్తం బ్లాక్ మనీనే అని.. అది త్వరలోనే వైట్ గా మారి ఆయన చేతుల్లోకి వస్తుందని ఒక మెసేజ్ పెద్ద ఎత్తున సర్కులేట్ అవుతోంది. మరి ఈ ప్రచారంలో ఎంత వరకు వాస్తవముందో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/