Begin typing your search above and press return to search.
జింబాబ్వేను చైనా ఆక్రమించేసినట్టేనా?
By: Tupaki Desk | 25 Aug 2021 5:30 PM GMTవిదేశాల్లోని వనరులను దోచుకుని ఏకంగా ఆయా దేశాలను తమ చెప్పుచేతల్లోకి తీసుకునే దుశ్చర్యలను గతంలో బ్రిటన్ యధేచ్చగా అమలు చేసేది. అలా భారత్ ను కూడా బ్రిటిష్ పాలకులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే మహాత్మా గాంధీ నేతృత్వంలో ఏళ్ల తరబడి సాగిన స్వాతంత్య్ర ఉద్యమం ఫలితంగా ఆంగ్లేయుల పాలన నుంచి భారత్ కు విముక్తి కలిగింది. ఇప్పుడు బ్రిటన్ ఇలాంటి చర్యలను ఆపేసినట్టేనని చెప్పాలి. అయితే బ్రిటన్ తరహా దుశ్చర్యలను ఇప్పుడు చైనా అందిపుచ్చుకున్నట్లుగా కనిపిస్తోంది. ఆఫ్రికాలోని చాలా దేశాల్లో పెట్టుబడులు పెడుతూ సాగుతున్న చైనా.. ఇప్పటికే చాలా దేశాలను తన స్వాధీనంలోకి తీసుకుందనే ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి జింబాబ్వే కూడా చేరిపోయింది. ప్రస్తుతం జింబాబ్వేలో చైనా సాగిస్తున్న దమనకాండపై ఆ దేశ హక్కుల సంఘం ఆర్గనైజేషన్ ది జింబాబ్వే కాంగ్రెస్ ఆఫ్ ట్రేడ్ యూనియన్(జెడ్‌సీటీయూ) పోరాటం మొదలెట్టింది.
జింబాబ్వేలో చైనా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. జింబాబ్వేలోని దాదాపుగా అన్ని రంగాల్లోకి చొరబడిపోయిన చైనా కంపెనీలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను కూడా పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అంతేకాకుండా బ్రిటిష్ పాలకుల మాదిరే.. జింబాబ్వేలో కొత్తగా నెలకొల్పిన తమ కంపెనీల్లో తమ దేశస్తులకు ఓ రకమైన వేతనాలు ఇస్తున్న చైనా వ్యాపారులు.. జింబాబ్వే కార్మికులకు మాత్రం అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారు. అసలే తీవ్ర ఆర్థిక సంక్షభంలో చిక్కుకుపోయిన జింబాబ్వే.. చైనా వ్యాపారులను నియంత్రించలేపోతోంది. తమ దేశానికి చెందిన కార్మికులకు కనీస వేతనాలను కూడా ఇప్పించుకోలేకపోతోంది. తమ కార్మికులపై చైనా కంపెనీలు సాగిస్తున్న దురాగతాలను కూడా అడ్డుకోలేకపోవడంతో పాటుగా కనీసం నిలదీసే యత్నం చేయలేకపోతోంది. ఇటీవల తమ వేతనాలు చెల్లించాలన్న జింబాబ్వే కార్మికులను చైనాకు చెందిన ఓ కంపెనీ యాజమాన్యం ఏకంగా కాల్చి చంపేసింది. ఈ ఘటనపై ఆ కంపెనీపై జింబాబ్బే ప్రభుత్వం కనీసం కేసు కూడా నమోదు చేయని వైనం ఈ తరహా పరిస్థితులకు అద్దం పడుతోందని చెప్పాలి.
అయితే ప్రపంచంలో ఎక్కడ కూడా దుర్మార్గ పాలన ఎల్లకాలం సాగదు కదా. బ్రిటిష్ పాలకులను భారతీయుల మాదిరే చాలా దేశాల ప్రజలు తమ ఉద్యమాలతో తిప్పికొట్టిన వైనమే ఇందుకు నిదర్శనమని చెప్పాలి. ఈ కోణంలోనే ఇప్పుడిప్పుడే జింబాబ్వేలో చైనా దురాగతాలపై పోరాటం మొదలైంది. ఆర్గనైజేషన్ ది జింబాబ్వే కాంగ్రెస్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ నేతృత్వంలో జింబాబ్వే వాసులు పోరాటం మొదలెట్టారు. ఈ ఉద్యమం క్రమంగా విస్తరిస్తోంది. జెడ్‌సీటీయూ సెక్రటరీ జనరల్ జపేత్ మయో.. సోషల్ మీడియా క్యాంపెయిన్ ని కూడా ప్రారంభించారు. కాలక్రమేణా, జింబాబ్వేలో చైనీస్ వ్యతిరేక భావాలు క్రమంగా పెరుగుతున్నాయి. చైనా స్వార్థ ప్రయోజనాల కోసం తాము అణచివేయబడ్డామని జింబాబ్వే ప్రజలు గ్రహించడం ప్రారంభించారు. అదేవిధంగా జింబాబ్వేలోని గోల్డ్,క్రోమ్ వంటి విస్తారమైన వనరులను కూడా చైనా కొల్లగొడుతోందని జింబాబ్వేలోని ఓ నేత సంచలన ఆరోపణలు చేశారు. తమ దేశంలోని వారసత్వ కట్టడాలను కూడా చైనా నాశనం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా చైనా దమన నీతిపై జింబాబ్వేలో పోరాటం మొదలైనట్టేనని చెప్పాలి.